నోట్లో పుండ్లు తక్షణమే తగ్గే ఇంటి చిట్కాలు?

Purushottham Vinay
నోటి పూత అదే మౌత్ అల్సర్ ఎంతగా బాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏమైన తిన్నా తాగినా నొప్పి నరకంగా ఉంటుంది. నోటి పూతని తగ్గించుకోవడానికి కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.జామ ఆకులు అల్సర్లను నయం చేయడంలో ఉపయోగపడతాయి. ఇందుకోసం ఒక కప్పు నీళ్లు తీసుకుని అందులో రెండు మూడు జామ ఆకులను వేసి మరిగించి తర్వాత నోరు కడుక్కోవాలి. అల్సర్ సమస్య నుంచి త్వరలో ఉపశమనం పొందుతారు. నోటి పుండ్లకు లవంగం నూనె దివ్యౌషధం. దీన్ని అప్లై చేయడం వల్ల పొక్కులు త్వరగా నయమవుతాయి. ఇందులో యూజినాల్ సమ్మేళనం కనుగొనబడింది. ఇది సహజ మత్తుమందుగా పనిచేస్తుంది. ఇది త్వరగా బొబ్బలు, వాపు రెండింటినీ తొలగించగలదు. దీని కోసం ఒక కప్పు వేడి నీటిలో కొన్ని చుక్కల లవంగం నూనె తీసుకొని పుక్కిలించాలి. దీంతో పొక్కులు త్వరగా మానిపోతాయి.అలాగే తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల అల్సర్‌లను తొలగించి త్వరగా ఉపశమనం కలిగిస్తుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపింది.


ఇందుకోసం కొన్ని చుక్కల నిమ్మరసాన్ని తేనెతో కలిపి అల్సర్లపై రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.పెరుగులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా పెరుగు అల్సర్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. పెరుగులో సహజమైన ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది కడుపు సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. దీని కారణంగా బొబ్బలు నయం అవుతాయి. ఇది పేగు ఆరోగ్యానికి కూడా మంచిది.ఇంకా నాలుక పుండ్లను వాటి మూలాల నుంచి తొలగించడంలో ఉప్పు చాలా సహాయపడుతుంది. ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఇది అల్సర్ వల్ల వచ్చే వాపు, నొప్పిని తగ్గిస్తుంది. దీనికోసం ఒక కప్పు వేడి నీటిలో 1 టీస్పూన్ ఉప్పు కలిపి ఈ నీటిని పుక్కిలించాలి. దీని వలన తక్షణ ఉపశమనం పొందుతారు.సాధారణంగా మౌత్ అల్సర్లు 7 నుంచి 10 రోజుల వరకు ఉంటాయి. కానీ  మౌత్ అల్సర్స్ తగ్గడానికి పైన చెప్పిన హోం రెమెడీస్‌ను పాటించడం వలన త్వరగా నయమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ టిప్స్ ట్రై చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: