దసరా కాంబో రిపీట్.. ఈసారి అంతకుమించి.. పోస్టర్ వైరల్..!!

murali krishna
న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది 'దసరా' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని టాప్ లెవెల్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. గతేడాది మార్చి 30వ తేదీన  ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయింది. పక్కా మాస్ అవతార్‌లో నాని యాక్టింగ్‍కు మరోసారి ప్రేక్షకులు అందరూ ఫిదా అయ్యారు. నాని కెరీర్ లో తొలి రూ.100 కోట్ల కలెక్షన్ల మూవీగా దసరా మూవీ  నిలిచింది. అలాంటి బ్లాక్ బస్టర్  సినిమాకు నేటి (మార్చి 30, 2024)తో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా నాని సర్‌ప్రైజింగ్ అనౌన్స్మెంట్ చేశారు. శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమాను అనౌన్స్ చేశారు. దీంతో దసరా కాంబో మళ్లీ రిపీట్ కానుంది.శ్రీకాంత్ ఓదెలతో నాని మరో సినిమా చేస్తారని..ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ లో శ్రీకాంత్ బిజీగా ఉన్నారని  కొంతకాలంగా రూమర్లు వైరల్ అయ్యాయి...తాజాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమాను కన్ఫర్మ్ చేస్తూ నాని ఓ పోస్టర్ ను కూడా షేర్ చేశారు.

ఈ మూవీ నాని కెరీర్ లో 33వ చిత్రం కావడంతో దీని వర్కింగ్ టైటిల్ “నాని33”గా ఉంచారు.ఈ చిత్రం కూడా యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుందని సమాచారం."విప్లవం ప్రారంభమయ్యే ముందు హింస సరైన రూపంలోకి మారుతుంది" అంటూ మూవీ టీమ్ ఈ సినిమాను ప్రకటించింది. త్వరలో రక్తపాతం కోసం సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ చిత్రంలోనూ యాక్షన్ భారీగా ఉండనుందని తెలుస్తుంది.అలాగే నాయకుడిగా ఉండేందుకు గుర్తింపు అవసరం లేదంటూ ‘నాని 33’ పోస్టర్‌పై ఉంది. అలాగే పోస్టర్ అంతా రక్తపు రంగులో నే ఉంది. నాని షర్ట్, కళ్లద్దాల్లో ప్రజలు ఉన్నట్టుగా అయితే పోస్టర్ ఉంది. దీంతో ఈ చిత్రంలో ఓ నాయకుడిగా నాని నటిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ పోస్టర్‌లో నాని నోట్లోని బీడీ నుంచి వచ్చే పొగ ఎంతో హైలైట్ గా వుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: