అఫీషియల్ : "టిల్లు స్క్వేర్" కి మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
నిన్న అనగా మార్చి 29 వ తేదీన టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన టిల్లు స్క్వేర్ అనే మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ టాక్ ని తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు మొదటి రోజు దక్కాయి. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా మొదటి రోజు దక్కిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసింది.
 

టిల్లు స్క్వేర్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో మరికొన్ని రోజుల పాటు ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.

మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఏ స్థాయి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ లోని సిద్దు నటనకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: