ప్రభాస్... సందీప్ కాంబో మూవీ ఆ నెల నుండి ప్రారంభం..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో స్పిరిట్ అనే మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ మూవీ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ దర్శకుడు అయినటు వంటి సందీప్ కొన్ని రోజుల క్రితమే తెలియజేశాడు. ఇక ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఏ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్ర లో నటించకపోవడంతో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం సందీప్ ప్రభాస్ హీరో గా రూపొందబోయే స్పిరిట్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన మొత్తం ఫ్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ మూవీ ని డిసెంబర్ నెల నుండి సెట్స్ పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఈ మూవీ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రభాస్ ఆఖరుగా సలార్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న కల్కి మూవీ లోను ... మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ లోనూ నటిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో "సలార్ 2" మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగా కొంత కాలం క్రితమే యానిమల్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: