"టిల్లు స్క్వేర్" కి ఫస్ట్ డే అన్ని కోట్ల కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందా..?

Pulgam Srinivas
డిజె టిల్లు మూవీ తో ఓవర్ నైట్ లో తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే డీజే టిల్లు మూవీ తో అద్భుతమైన విజయాన్ని ... సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ యువ నటుడు తాజాగా ఈ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన "టిల్లు స్క్వేర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ మూవీ ఈ రోజు అనగా మార్చి 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. ఇకపోతే ఇప్పటికే డీజే టిల్లు మూవీ సూపర్ సక్సెస్ ను అందుకోవడం ... అలాగే ఈ మూవీ కి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ మూవీ రూపొందడం ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు పాటలు అన్నీ కూడా అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై మొదటి నుండి కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒక వేళ ఈ సినిమాకు నిజం గానే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చినట్లు అయితే ఈ మూవీ ఫస్ట్ డే సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా వసూలు చేసినట్లు అవుతుంది. మరి ఈ సినిమాకు మొదటి రోజు ఏ స్థాయి కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతాయో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: