నితిన్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఆ మూడు సినిమాల అప్డేట్స్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ కొంత కాలం క్రితం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి హారిజ్ జయరాజ్ సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ కంటే ముందు నితిన్ "మాచర్ల నియోజక వర్గం" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ మూవీ కూడా ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించలేదు. ఇలా వరుసగా రెండు అభజాయలను ఎదుర్కొన్న ఈయన చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఆ మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్ లను రేపు అనగా మార్చి 30 వ తేదీన ఈయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల కానున్నాయి. రేపు నితిన్ నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన ఏ అప్డేట్ లు విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసు కుందాం.
నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే రేపు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో వీడియోను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇకపోతే ప్రస్తుతం నితిన్ ఈ సినిమాతో పాటు తమ్ముడు అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ లోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం వారు రేపు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే వచ్చేసింది. ఇకపోతే నితిన్ మరి కొన్ని రోజుల్లోనే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రేపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: