నేను వేసుకున్న దుస్తులను బట్టి మీరు అలా అనుకుంటారా... పరిమితి చోప్రా..?

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటీ మణులలో పరిణితి చోప్రా ఒకరు. ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపును బాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇకపోతే హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ నీ కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె వివాహం చేసుకుంది. పోయిన సంవత్సరం ఆప్ ఎంపీ అయినటువంటి రాఘవ్ చాద్ద  ను పరిణితి వివాహం చేసుకుంది.

ఇకపోతే ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతోంది. ఇకపోతే తాజాగా పరిణితి చోప్రా గర్భం దాల్చింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా ఈ బ్యూటీ ప్రస్తుతం గర్భం తో ఉంది అని వార్తలు రావడానికి ప్రధాన కారణం తాజాగా ఈమె ఎయిర్ పోర్టు కు వెళ్ళింది. అలా వెళ్లిన సందర్భం లో ఈమె వదులు దుస్తులను ధరించింది. దానితో ఈమె కడుపుతో ఉంది అందుకే వదులు దుస్తులను ధరించింది అని వార్తలను పుట్టించారు.

ఇకపోతే ఇలా తాను కడుపుతో ఉంది అని అనేక వార్తలు రావడంతో ఈ వార్తలపై పరిణితి చోప్రా తాజాగా గట్టిగా స్పందించింది. తాజాగా పరిణితి చోప్రా మాట్లాడుతూ ... నేను లూస్ గా ఉన్న వస్త్రాలను ధరించినందుకు నేను కడుపుతో ఉన్నాను అనే వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. నేను వేసుకున్న దుస్తులను బట్టి నేను కడుపుతో ఉన్నాను అనే వార్తలను స్ప్రెడ్ చేయడం సరికాదు అని తనపై తప్పుడు రాస్తాలు రాస్తున్న వారిపై గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

ఇకపోతే పరిణితి చోప్రా సినిమాల విషయానికి వస్తే ... 2013 వ సంవత్సరంలో విడుదల అయిన శుద్ధ్ దేశీ రోమాన్స్  , అలాగే 2014 లో విడుదల అయినటువంటి హసీతో ఫసీ మూవీలలోనీ పరిణితి  నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాల్లోని నటనతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు కూడా లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pc

సంబంధిత వార్తలు: