'లైలా' గా కనిపించబోతున్న విశ్వక్ సేన్..!!

murali krishna
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..రీసెంట్ గా గామి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ డీసెంట్ హిట్ అందుకున్నాడు..గామి మూవీలో విశ్వక్ యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ప్రస్తుతం ఈ హిరో నుంచి వస్తున్న మరో లేటెస్ట్ చిత్రం  'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. మే 17 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..అయితే నేడు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా తన తాజా ప్రాజెక్ట్‌లు వరుస అనౌన్స్‌మెంట్లు వస్తున్నాయి.ఇక విశ్వక్ నటిస్తున్న మరో క్రేజీ మూవీ VS12. ఈ మూవీని భగవంత్‌ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది.తాజాగా ఈ మూవీ టైటిల్‌ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.ఈ మూవీకి 'లైలా' అనే టైటిల్ ని పెట్టారు. ఇక ఈ సినిమా లో తాను లేడీ గెటప్‌ లో కనిపించబోతున్నట్టు విశ్వక్‌సేన్ ప్రకటించాడు.

నూతన దర్శకుడు రామ్ నారాయణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు... ఆకాంక్ష శర్మ ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతుందని సమాచారం.తనిష్క్‌ బాగ్చి మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌ గా పనిచేస్తున్నారు.ఇదిలా ఉంటే విశ్వక్‌సేన్ మరోవైపు రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్న “VS 10” లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. హై ఫోర్స్‌ ఇంజిన్ త్వరలోనే షురూ అవుతుంది.. ఫన్‌ రైడ్‌ కోసం సిద్ధంగా ఉండండి.. అంటూ మేకర్స్ ఇప్పటికే రిలీజ్‌ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తల్లూరి నిర్మిస్తున్నారు.ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.ఇలా విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: