హాట్ టాపిక్ గా మారిన మంచు విష్ణు నవతి !

Seetha Sailaja
రెండు సంవత్సరాల క్రితం రాజకీయ పార్టీల ఎన్నికల హడావిడి మించి ‘మా’ సంస్థ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఒకరి పై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కొనసాగిన ఆనాటి ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు ప్యానల్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మా సంస్థకు ఒక సొంత భవనాన్ని తన సొంత ఖర్చుతో నిర్మించి ఇస్తాను అంటూ అప్పట్లో మంచు విష్ణు చేసిన వాగ్ధానం ఇప్పటికీ నెరవేరలేదు.

ఇప్పుడు త్వరలో మంచు విష్ణు పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంలో ఇప్పుడు గతంలో తాను ఇచ్చిన వాగ్ధానాలు పూర్తి చేయడానికి విష్ణు రంగంలోకి దిగుతున్నట్లు గా సాంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు మా సంస్థ ఆద్వర్యంలో ‘నవతి’ అన్న పేరుతో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ మలేషియాలో నిర్వహించబోతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి స్వర్ణయుగం నాడుస్తోందని చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో పాటు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడంతో పాటు ప్రభాస్ హైయెస్ట్ పెయిడ్‌ ఇండియన్ యాక్టర్‌ గా మారడం మహేష్‌ రాజమౌళి సినిమా ఆసియాలోనే బిగ్గెస్ట్ మూవీగా కాబోతూ ఉండటంతో ఈ విషయాలు అన్నీ టాలీవుడ్ ఖ్యాతిని పెంచుతున్న నేపధ్యంలో ఈ ఆనందాన్ని ఇండస్ట్రీలోని అందరితో పంచుకోవడానికి ఏర్పాటు చేసిన ఈవెంట్ ‘నవతి’ అంటూ మీడియాకు ఈ విషయాన్ని షేర్ చేశాడు.

గతంలో దాసరినారాయణరావు జీవించి ఉన్న కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ 75 సంవత్సరాల పండుగ హైదరాబాద్ లో అత్యంత ఘనంగా నిర్వహించినప్పుడు కూడ అప్పట్లో చిరంజీవి అక్కినేని లాంటి దిగ్గజాలకు సన్మానాలు జరిగినప్పుడు ఆనాటి వేడుకలలో ఎన్నో వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆతరువాత ఇండస్ట్రీ ప్రముఖులు అంతా కలిసి నిర్వహించిన వేడుకలు పెద్దగా జరగలేదు. దీనితో మంచు విష్ణు నిర్వహించబోయే ‘నవతి’ లో ఎటువంటి వివాదాలు లేకుండా జరిగి టాలీవుడ్ ఇండస్ట్రి ఖ్యాతిని పెంచుతాయి అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: