దేవర మూవీలో.. ఎన్టీఆర్ భార్య ఈవిడేనట?

praveen
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే గుర్తింపును సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇక ఎప్పుడు ఏకంగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే అటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు.

 ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్ సినిమాలోని తన నట విశ్వరూపం చూపించిన జూనియర్ ఎన్టీఆర్ ఇక చేయబోయే తర్వాత సినిమా ఏంటి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే తనకు సూపర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మరోసారి సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్  పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ మూవీలో తారక్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది.

 ఈ సినిమా అప్డేట్ కోసం అటు తారక్ అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక మరాఠీ హీరోయిన్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. దేవర సినిమాలో తాను నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది శృతి మరాఠీ. దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల కాబోతుంది  ఈ చిత్రంలో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పటికే జాన్వి కపూర్ తంగం అనే పాత్రలో నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. కాగా సీక్రెట్ గా ఉంచాల్సిన విషయాన్ని ఇలా శృతి రివిల్ చేయడంతో అటు చిత్ర బృందానికి షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: