వైసీపీ, టీడీపీ, జనసేన.. అన్ని పార్టీలదే అదేమాట?

Chakravarthi Kalyan
పేదవారికి సేవ చేసేందుకు, సమాజాన్ని ఉద్దరించేందుకు.. గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాను ప్రగతి పథంలో నిలిపేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పేదవారిని ఎన్నుకునేందుకు పేదవారే సిద్ధంగా లేరు. ఇది ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రం. డబ్బుంటేనే రాజకీయాలు. మధ్య తరగతి నాయకుడిని ఎన్నుకునేందకు   ఆ వర్గం వారు సిద్ధంగా లేరు.  

అటు పేదలకు, ఇటు మధ్య తరగతి వారికి ధనవంతులే కావాలి. దాని పర్యావసానమే ప్రజాస్వామ్యం కాస్తా.. ధనస్వామ్యంగా మారింది. ఒకవేళ ఆయా పార్టీల నాయకులు దయ తలచి.. ఏదో ఒక మధ్యతరగతి వారికో.. పార్టీ కార్యకర్తకో టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ టికెట్ ఇచ్చినా వెనుక నుంచి పార్టీ ఆర్థికంగా అండగా నిలబడాల్సిందే. ప్రస్తుతం ఏపీలో నామినేషన్ల పర్వం ముగిసింది.  ఇందులో అధికశాతం ధనవంతులే ఉండటం గమనార్హం.

ఈసారి నామినేషన్లు వేసిన అభ్యర్థుల ఆస్తుల వివరాలు పరిశీలిస్తే.. వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబానికి రూ.22 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక కేశినేని నానిని పరిశీలిస్తే రూ.77 కోట్లు ఉన్నాయి. ఇందులో చరాస్తులు రూ.64 కోట్లు ఉండగా. ఆరు లక్సరీ కార్లు ఉన్నాయి. కైకలూరు ఎమ్మెల్యే రూ.15 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా..ఆయన భార్య పేరిట కూడా అంతే విలువైన ఆస్తులు ఉన్నాయి. మచిలీపట్న నుంచి పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖర్ రావు కు రూ.138 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

ఎంపీ మిథున్ రెడ్డి విషయానికొస్తే రూ.47 కోట్ల చరాస్తులు, రూ.163 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.11వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఉన్నాయి. ద్వారాపూడి చంద్రశేఖర్ రెడ్డి రూ.76 కోట్ల స్థిరాస్తులు, రూ.11 కోట్ల చరాస్తులు ఉన్నాయి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు విషయానికొస్తే.. రూ.2 కోట్ల చరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికొస్తే ఏమీ లేవు. విక్రమ్ రెడ్డి కి రూ.209 కోట్ల కుటుంబ ఆస్తులు ఉన్నాయి. కొడాలి నానికి రూ.16 కోట్ల చరాస్తులు, రూ.4 కోట్ల స్థిరాస్తులు, బొత్స ఝాన్సీకి 320 తులాల బంగారం, రెండు కార్లు, ఇద్దరి పేరున రూ.21 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: