
ఆ సినిమా వల్ల.. సిగరెట్ కు బానిసగా మారిపోయా : హీరోయిన్
అయితే ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రిటీలు పాత్రల కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నారు కొంతమంది. ఏకంగా పాత్ర కోసం సిగరెట్ తాగుతుంటే ఇంకొంతమంది ఏకంగా ఆల్కహాల్ తాగడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. అయితే విద్యాబాలన్ కూడా ఇలా డర్టీ పిక్చర్ సినిమాలో ఎన్నో సన్నివేశాలలో సిగరెట్ తాగుతూ కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించిన సమయంలో నిజజీవితంలో కూడా తనకు సిగరెట్ అలవాటు అయింది అంటూ ఇటీవలే విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ డర్టీ పిక్చర్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులను పంచుకుంది.
డర్టీ పిక్చర్ సినిమా కారణంగా సిగరెట్లకు బానిసగా మారిపోయాను. ఆ సినిమాలో సిగరెట్లు తాగే సీన్లు ఎక్కువగా చేశాను. అలా సిగరెట్ తాగడంతో దానికి ఎడిక్ట్ అయిపోయాను. ఆ తర్వాత కూడా రోజుకి రెండు మూడు సిగరెట్లు తాగితే కానీ ప్రశాంతంగా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం మాత్రం తాగడం లేదు. ఇక కాలేజీ రోజుల్లో ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు అంటే చాలు ఆ పొగను ఎంతగానో ఆస్వాదించే దాన్ని అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది అయితే ఆమె నటించిన డర్టీ పిక్చర్ సినిమా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సూపర్ హిట్ కావడమే కాదు ఇది ఒక వివాదాస్పద సినిమాగా కూడా మిగిలిపోయింది.