ఈ ఐపీఎల్ సీజన్లో.. అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమ్ ఏదో తెలుసా?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే.  తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయాలి అనే ఒక ఒత్తిడి ప్రతి బ్యాటర్ ఫై కూడా ఉంటుంది. అందుకే గ్రీజూలోకి వచ్చిన ప్రతి ఆటగాడు కూడా మొదటి బంతి నుంచే సిక్సర్లు ఫోర్ లతో చలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే టి20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారు.

 వికెట్ల మధ్య పరిగెడుతూ సింగిల్స్ తీయడం ద్వారా పరుగులు చేయడం కంటే అటు బౌండరీల ద్వారానే టి20 ఫార్మాట్ లో ఎక్కువ పరుగులు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఐపిఎల్ టోర్నీలో కూడా బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇక సిక్సర్లతో ఎంతోమంది బ్యాట్స్మెన్లు చెలరేగిపోతున్నారు అని చెప్పాలి.

 అయితే ఇప్పుడు వరకు సగం ఐపీఎల్ మ్యాచ్లు ముగిసాయ్. కాగా ఇప్పటివరకు టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీం ఏది అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆ టీం ఏదో కాదు సన్రైజర్స్ హైదరాబాద్. ఇప్పటివరకు ఏకంగా 108 సిక్సర్లను బాధింది ఈ జట్టు ఇక తర్వాత స్థానంలో 90 సిక్సర్లతో ఆర్సిబి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఢిల్లీ 86, ముంబై 85, కోల్కతా 69, చెన్నై 65, రాజస్థాన్ 64, లక్నో 62, పంజాబ్ 61, గుజరాత్ 39 సిక్సర్లతో తర్వాత స్థానంలో ఉన్నాయి.  అలాగే ఫోర్లు కొట్టడం విషయంలో ఆర్సిబి టాప్ లో ఉంది. 143 ఫోర్లు కొట్టింది. తర్వాత స్థానంలో ఢిల్లీ 139, గుజరాత్ 137 ఫోర్ లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: