బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకున్నాడు.. కానీ చివరికి?

praveen
నేటి టెక్నాలజీ యుగంలో బ్రతికేస్తున్న మనిషి ప్రతి పనిని కూడా ఎంతో సులభతరంగా మార్చుకునేందుకే ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకప్పటిలా చెమటోడ్చి కష్టపడేందుకు ఎవరు కూడా ఇష్టపడటం లేదు. అయితే ఇక ప్రతి రంగంలో కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఒక్క చుక్క చెమట చిందించకుండానే అన్ని పనులు పూర్తవుతున్నాయి. ఏకంగా కూర్చున్న చోటు నుంచి అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లోనే సగం పనులను పూర్తి చేయగలుగుతున్నాడు మనిషి.

 అయితే ఇలా మనిషి జీవనశైలిలో వచ్చిన మార్పు ఇక కొన్ని కొన్ని అనారోగ్యాలకు కూడా కారణం అవుతుంది.  నేటి రోజులో ఉద్యోగాల దగ్గర నుండి చేసే ప్రతి పని కూడా ఒకే చోట గంటలు తరబడి కూర్చుని చేసేవే కావడంతో ఎంతోమంది ఇక బరువు పెరిగిపోయి ఊబ కాయులుగా మారిపోతున్న పరిస్థితి. అయితే ఇక నేటి రోజుల్లో ఆహారపు అలవాట్ల కారణంగా కూడా ఇలా బరువు పెరిగిపోయి ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు జనాలు. కొంతమంది ఇక జిమ్ కు వెళ్లి కసరతులు చేస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది కసరతులు చేసి చెమట చిందించడం కాదు.. సులభంగా బరువు తగ్గడం ఎలా అని ఆలోచిస్తున్నారు.

 చివరికి కొంతమంది బరువు తగ్గించుకోవాలని సర్జరీలను కూడా ఆశ్రయిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక యువకుడు ఇలాగే బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకున్నాడు. చివరికి ప్రాణం పోయింది. పుదుచ్చేరిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హేమచంద్రన్ అనే 26 ఏళ్ల యువకుడు బరువు తగ్గించుకునేందుకు చెన్నైలోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అయితే చికిత్స ప్రారంభించిన 15 నిమిషాలకే అతనికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. దీంతో హేమచంద్రన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై స్పందించిన తమిళనాడు వైద్య శాఖ ఘటనపై విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: