వరుసగా ఓడిపోతున్నా.. పంజాబ్ బౌలర్లు తోపులే?

praveen
టి20 ఫార్మాట్లో బ్యాటింగ్ చేయడం ఇంత ఈజీనా అని అనిపించే విధంగా ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బ్యాట్స్మెన్ ల విధ్వంసం కొనసాగుతుంది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో ఇలా ఒక టీం భారీగా పరుగులు చేసారు అనుకుంటే పొరపాటే. ప్రతి మ్యాచ్ లోను 200 ప్లస్ స్కోర్లు నమోదు అవుతున్నాయి. టీ20 ఫార్మాట్లో ఇలా 200 ప్లస్ స్కోర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒకరకంగా చెప్పాలంటే వన్డే ఫార్మాట్లో ఈ స్కోర్ 400 లేదా 450 పరుగులతో సమానం. అయితే ఇంతటి భారీ స్కోర్ చేసిన తర్వాత ఇక టార్గెట్ ను చేదించే జట్టు ఒత్తిడికి లోనవ్వడం చూస్తూ ఉంటాం. కానీ ఐపీఎల్ లో మాత్రం అలా జరగడం లేదు.

 ప్రతి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 200 కు పైగా పరుగులు నమోదు చేయడం.. ఇక ఆ తర్వాత చేజింగ్కి దిగిన జట్టు కూడా ఒత్తిడికి లోనవ్వకుండా 200కు పైగానే పరుగులు చేయడం చేస్తూ ఉన్నాం. కొన్ని కొన్ని సార్లు ఇక టార్గెట్ ను చేదిస్తే.. మరికొన్నిసార్లు 200 కు పైగా పరుగులు చేసినప్పటికీ కొన్ని పరుగుల దూరంలో ఆగిపోయి ఓటమి చవిచూస్తున్నాయి. అయితే ఇలా మహా మహా బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకుంటూ ప్రత్యర్థి టీమ్ 200 పరుగులు చేయడానికి కారణం అవుతూ ఉన్నారు. అయితే ఈ గణంకాలు చూసుకుంటే వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ బౌలర్లు మాత్రం తోపులే అన్నది అర్థమవుతుంది.

 ఎందుకంటే మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే పంజాబ్ బౌలర్లు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తక్కువ పరుగులు సమర్పించుకున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్లో 41 మ్యాచ్లు జరగగా.. పంజాబ్ కింగ్స్ ఏ జట్టును 200 పరుగులు చేయనీయలేదు. బెంగళూరుకు ఇచ్చిన 199 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. కానీ ఇటీవల కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ ఆ భారీ టార్గెట్ ను చెందింది ఘనవిజయాన్ని అందుకుంది పంజాబ్. అయితే ఇప్పటివరకు ఐపీఎల్లో ఉన్న మిగతా 9 టీమ్స్ ప్రత్యర్థులకు పలుమార్లు  200 కు పైగా పరుగులు సమర్పించుకున్నాయి. ఇలా వరుసగా ఓడిపోతున్న ఆ జట్టు బౌలర్లు మాత్రం మెరుగైన యావరేజ్ మైంటైన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: