ట్రోల్స్ వచ్చిన ఫుల్ జోష్ లో దూసుకెళ్తున్న ది ఫ్యామిలీ స్టార్..!

Pulgam Srinivas
విజయ్ దేవరకొండ కొన్ని రోజుల క్రితమే ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించగా ... పరశురామ్ పేట్ల ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి భారీ మొత్తంలో నష్టాలే వచ్చాయి.

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. మరి ముఖ్యంగా హీరో ఈ సినిమాలో చిన్న పిల్లలకు దోశ వేసే సన్నివేశాన్ని అనేక మంది ట్రోల్ చేశారు. ఎంత మిడిల్ క్లాస్ అయితే మాత్రం మరి దోసెలను అంత సన్నంగా వేసుకుంటారా..? తిండి కోసం కూడా అంత వెనకాడాల్సిన అవసరంలో మధ్య తరగతి కుటుంబాలు ఏమి ఉండవు. తెలిసి తెలియకుండా అలాంటి సన్నివేశాలు తీయకండి.

ఇలా రకరకాలుగా ఈ సన్నివేశంపై ట్రోల్స్ చేశారు. అలాగే ఈ చిత్రంలోని ఇంకొన్ని సన్నివేశాలపై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఎన్ని ట్రోల్స్ ఈ సినిమాపై , ఈ సినిమాలోని సన్నివేశాలపై వచ్చిన కూడా ఈ మూవీ మాత్రం ఓ టి టి లో ఫుల్ జోష్ లో దూసుకుపోతోంది. ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పటికి కూడా ఈ సినిమా అదే స్థానంలో కొనసాగుతుంది. ఇలా ట్రోల్స్ ను ఎదుర్కొని ఈ సినిమా ఓ టి టి లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd

సంబంధిత వార్తలు: