మోస్ట్
బ్యూటిఫుల్ నటీమణి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈమె పోయిన సంవత్సరం
కార్తికేయ 2 అనే
మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ
మూవీ తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యి సూపర్
సక్సెస్ కావడంతో ఈ నటి క్రేజ్
ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. తాజాగా ఈమె టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ కూడా 125 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టడంతో ఈ
బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. దానితో ఈమెకు వరుస
సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.
ప్రస్తుతం ఈ
బ్యూటీ చేతిలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం. ఈమె ప్రస్తుతం హనుమాన్ సినిమాతో దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆక్టోపస్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ
మూవీ తో పాటు
సినిమా బండి దర్శకుడి దర్శకత్వంలో రూపొందుతున్న పరదా అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ
మూవీ కి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్
పోస్టర్ ను కొన్ని రోజులు విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ
బ్యూటీ తమిళ్ లో పెట్ డిటెక్టివ్ అనే
మూవీ లో నటిస్తోంది.
ఈ సినిమాకు ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ లతో పాటు ఈమె బైసన్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ
మూవీ కి
ధృవ్ విక్రమ్ హీరో గా మరి సెల్వరాజ్ దర్శకత్వంలో పా రంజిత్ ఒక నిర్మాతగా చేస్తున్నారు. వీటితో పాటు ఏ ఆర్
జీవా దర్శకత్వంలో లాక్ డౌన్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇలా ఈ
బ్యూటీ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి.