అరెరే.. ట్రావిస్ హెడ్ వీక్నెస్ ఏంటో తెలిసిపోయిందిగా?

praveen
ట్రావిస్ హెడ్.. ఈ పేరు చెబితే చాలు బౌలర్లకు నిద్ర కూడా పట్టడం లేదు. ఎందుకంటే అతని బ్యాటింగ్ ఊచకోత ఆ రేంజ్ లో ఉంటుంది.  సాధారణంగా బౌలర్లకు వారి బౌలింగ్ పై ఒక ఐడియా ఉంటుంది. ఎలాంటి బంతులను సందిస్తే వికెట్ దక్కించుకోవచ్చు అని ఒక అవగాహన ఉంటుంది. కానీ ట్రావిస్ హెడ్ విషయంలో మాత్రం బౌలర్ల పప్పులు ఉడకడం లేదు. బంతి ఎక్కడ వేసిన సరే అది బౌండరీ అవతలే కనిపిస్తుంది. సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతున్న అతని బ్యాటింగ్ తీరు బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఎందుకు బౌలర్లం అయ్యామా అని బాధపడే విధంగా అతను విద్వాంసాన్ని సృష్టిస్తున్నాడు.

 పూనకం వచ్చిందేమో అన్నట్లుగా బ్యాట్ పట్టుకుని ఊగిపోతూ ఉన్నాడు. దీంతో అతని దూకుడు ముందు స్కోర్ బోర్డ్ సైతం పరుగులు పెట్టి అలసిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు సన్రైజర్స్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగుతూ అతను సృష్టిస్తున్న విధ్వంసం అంత ఇంతా కాదు.. జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తూ అదరగొడుతున్నారు ట్రావిస్ హెడ్. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. దీంతో అతనికి ఎక్కడ బంతివేయాలో కూడా తెలియక.. బౌలర్లు అందరూ కూడా అయోమయంలో పడిపోతున్నారు. ఇలా ప్రతి బంతిని బౌండరీకి తరలించే హెడ్ కి కూడా ఒక వీక్నెస్ ఉందట.

 ఈ క్రమంలోనే ట్రావిస్ వీక్నెస్ పాయింట్ ఇదే అంటూ ఒక న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. స్పిన్ బౌలింగ్లో హెడ్ తడబడుతున్న ఉన్నాడట. ఇదే వ్యూహంతో ఆర్సిబి కూడా తొలి ఓరే స్పిన్నర్ వీల్ జాక్ తో వేయించింది. అనుకున్నట్లుగానే హెడ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకొని వికెట్ సమర్పించుకున్నాడు. అయితే ఐపీఎల్ ఇప్పటివరకు స్పిన్నర్ల బౌలింగ్లో హెడ్ 150 స్ట్రైక్ రేట్  తో 63 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. అదే ఫాస్ట్ బౌలింగ్లో 236 స్ట్రైట్ తో 262 పరుగులు చేశాడు. అయితే విధ్వంసకర బ్యాటర్  హెడ్ బలహీనతను ప్రత్యార్ధి జట్లు పట్టేశాయని తర్వాత మ్యాచ్లలో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: