ఏంటి.. సుకుమార్ నెక్స్ట్ మూవీ ఆ స్టార్ హీరోతో చేస్తున్నాడా..!?

Anilkumar
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్పా సినిమాతో బిజీగా ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. పుష్ప పార్ట్ వన్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు సుకుమార్. దీంతో పార్ట్ 2 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  కాగా ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా బాలీవుడ్ ని అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 తో బిజీగా ఉన్న సుక్కు తన తదుపరి సినిమా ఎవరితో అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేస్తున్నాట్లు సుకుమార్ అఫిషియల్ గా ప్రకటించాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని టాక్. మరి పుష్ప పార్ట్ 2 తర్వాత సుక్కు హీరో ఎవరు ? అంటే సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాంచరణ్ తో అనే టాక్ వినిపిస్తోంది.  రాంచరణ్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రంగస్థలం మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

పుష్ప పార్ట్ 2 తర్వాత రంగస్థలం పార్ట్ 2 ను తెరకెక్కించే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ లైన్ కూడా రాంచరణ్ కు వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో పాటు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కూడా ఓ మూవీకి కమిటయ్యాడు.   ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉందట. అయితే పుష్ప పార్ట్ 3 కూడా తెరకెక్కించే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 తరువాత అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. దీన్ని బట్టి చూస్తే పుష్ప పార్ట్ 3 ఇప్పట్లో ఉండే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: