వణికిపోయేదాన్ని.. అలా చేయాలంటే చాలా భయమేసేది : సమంత

praveen
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు గత రెండు దశాబ్దాల నుంచి కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది. ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన అందం అభినయంతో మాత్రమే కాదు తన నటనతో కూడా ఇప్పటికే తానేంటో నిరూపించుకుంది సమంత. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ఈ హీరోయిన్ వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఏకంగా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అయిన పెద్దగా వార్తల్లో కనిపించలేదు. కానీ అతనితో విడాకుల తర్వాత మాత్రం తరచూ వార్తల్లోనే నిలుస్తుంది.


 సమంత ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా ఇంటర్నెట్ జనాలు ఆ విషయాన్ని తెలుసుకునేందుకు తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు అని చెప్పాలి. విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత ఇక ఇప్పుడు ఈ వ్యాధి నుంచి బయటపడి మళ్లీ కెరియర్ పై దృష్టి పెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ.. తన కెరియర్లో జరిగిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంది. అయితే విడాకుల తర్వాత సమంత జీవితంలో జరిగిన ఒక సెన్సేషన్ ఏంటి అంటే పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా ఊహు అంటావా సాంగ్. ఏకంగా విడాకుల తర్వాత సమంత ఇలాంటి సాంగ్ చేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.

 ఇక విమర్శలు పక్కన పెడితే ఈ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా రేంజ్ లో సమంతకు గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఈ సాంగ్ చేయడానికి ముందు తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను అన్న విషయాన్ని సమంత చెప్పుకొచ్చింది. ఊ అంటావా సాంగ్ చేసే ముందు ఎంతో భయపడ్డానని సమంత ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అలాంటి పాటలు చేయాలంటే ఎవరి మాట వినకూడదు. నా అందంపై నాకు తొలి నుంచి అసౌకర్యంగా ఉండేది. పెద్దగా ధీమాగా ఉండేదాన్ని కాదు. అందరూ అమ్మాయిల్లా కాదు అనుకునేదాన్ని. ఇక ఆ పాట ప్రారంభానికి ముందు ఎంతో వనికిపోయాను. కానీ ఇప్పుడు నటిగా వ్యక్తిగా ఎంతగానో ఎదిగాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: