మా నాన్న డైరెక్షన్లో.. అస్సలు నటించను.. ఆకాష్ పూరి కామెంట్స్?

praveen
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు ఏ భాషలో చూసినా ఏకంగా వారసులదే హవా కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా సీనియర్ స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి రాణించడం చేస్తూ ఉంటారు. ఇక కమెడియన్స్ గా కొనసాగిన వారి వారసులు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించడం నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఎంతోమంది దర్శక నిర్మాతలు సైతం ఇక వారి వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇలా వచ్చిన వారు తక్కువ సమయంలోని సక్సెస్ అవుతున్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక భారీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన కొంతమంది మాత్రం ఇక సరైన గుర్తింపును సంపాదించలేక.  ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉన్నారు.

 అలాంటి వారిలో సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు పూరి ఆకాష్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు. మాయాబజార్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక రొమాంటిక్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అనుకున్నాడు. కానీ ఎందుకో సరైన సక్సెస్ మాత్రం కొట్టలేకపోయాడు అని చెప్పాలి. అయితే ఆకాష్ పూరి ఇలా సక్సెస్ కాకపోవడానికి కారణం.. తండ్రి పూరి జగన్నాథ్ నుంచి అతనికి పూర్తిస్థాయి మద్దతు లేకపోవడమే అని ఎన్నో రూమర్స్ కూడా అప్పుడప్పుడు తెర మీదకి వస్తూ ఉంటాయి. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాష్ పూరి ఇక తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

 మీ నాన్న దర్శకత్వంలో ఎప్పుడు సినిమా చేయబోతున్నారు అంటూ ప్రశ్నించగా షాకింగ్ సమాధానం ఇచ్చాడు. నేను మా నాన్న దర్శకత్వంలో సినిమా చేయను. ఇదే నా నిర్ణయం. ఫస్ట్ నేను నటుడిగా ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తాను. మా నాన్న డైరెక్షన్లో నటించాలనే కోరిక కంటే కార్తికేయ 2,  హనుమాన్ లాంటి గొప్ప గొప్ప సినిమాలలో నటించాలనే కోరిక ఎక్కువగా ఉంది. నేను ఇప్పటికీ  పిల్లాడిలా ఉంటానని కంప్లైంట్ ఉంది. ఇక హీరోగా సెట్ అయిన తర్వాత విలన్ లాంటి పాత్రలు చేయడం విషయంలో కూడా ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని.. ఎలాంటి లవ్ ఎఫైర్స్ లేవు అంటూ ఆకాష్ పూరి తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: