దేవరలో జాన్వి కపూర్ కట్టుకున్న ఆ చీర.. ఎవరిదో తెలుసా?

praveen
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్ ఇక తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఆల్ టైం ఫేవరెట్ గా ఉండేది అన్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చిన కూడా సూపర్ హిట్ అవుతూ ఉండేవి. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసి ప్రేక్షకులను మైమరిపింప చేసేందుకు సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి వారసులు రెడీ అయ్యారు. ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ మనవడు తారక్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది శ్రీదేవి కూతురు జాన్వి కపూర్. దేవర సినిమాతోనే టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అని చెప్పాలి.

 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక దేవర మూవీలో అటు జాన్వి కపూర్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇటీవల జాన్వి కపూర్ తన పుట్టినరోజు జరుపుకోగా ఆ రోజున దేవర చిత్రబంధం జాన్వి కపూర్ పాత్రకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలో పట్టుచీరలో హెయిర్ లీవ్ చేసి, కొంటె చూపు చిన్న నవ్వుతో ఈ ముద్దుగుమ్మ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక ఆమె కట్టుబొట్టులో అచ్చ తెలుగు అందం ఉట్టిపడుతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనె ఇటీవల చిత్ర బంధం రిలీజ్ చేసిన పోస్టర్ లో అటు జాన్వి కపూర్ కట్టుకున్న చీర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే అది చాలా ఓల్డ్ మోడల్ సారీ కావడం గమనార్హం. దీంతో ఇక ఈ పాత మోడల్ చీర ఎవరిది అయి ఉంటుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈ చీర జాన్వి కపూర్ తల్లి శ్రీదేవిది అన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ చీరను జాన్వికపూర్ ఎంతో సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటుందట. ఇక దేవర మూవీలో ఒక స్పెషల్ సాంగ్లో జాన్వి కపూర్ ఈ చీరలోనే కనిపించి ప్రేక్షకులను ఆలరించబోతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: