ఆ టాలీవుడ్ హీరోనే.. నాకు యాక్టింగ్ లో రోల్ మోడల్ : సమంత

praveen
సమంత.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. ఎందుకంటే దాదాపు గత దశాబ్ద కాలానికి పైగానే ఆమె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా హవా నడిపిస్తూ ఉంది. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఏం మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే కుర్ర కారు మతిపోగట్టి ప్రేక్షకులందరికీ మాయ చేసేసింది. ఇక ఆ తర్వాత తన అందం అభినయంతో ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు చూపును కూడా తన వైపుకు తిప్పుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అందరి స్టార్లతో జతకట్టింది అని చెప్పాలి.

 ఇక ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను కూడా  తన ఖాతాలో వేసుకుంది సమంత. అయితే మధ్యలో సమంత భర్త నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకుంది. దీంతో వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే విడాకుల తర్వాత కూడా సమంత పూర్తిగా కెరియర్ పై దృష్టి పెట్టి ఇక ఎన్నో చాలెంజింగ్ రోల్స్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక మధ్యలో మయోసైటిస్ అనే మాయదారి వ్యాధి బారిన పడినప్పటికీ ఇక ఈ వ్యాధి నుంచి కోలుకొని ఇప్పుడు మళ్ళీ కెరియర్ పై దృష్టి పెట్టింది. అయితే సమంత అటు కెరియర్  లో అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక నటనలో కూడా తనకు తిరుగులేదు అని నిరూపిస్తుంది. అయితే ఇటీవల యాక్టింగ్ లో తనకు రోల్ మోడల్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది సమంత.

 ఇటీవలే ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటనలో స్ఫూర్తి ఎవరు అని అడిగిన ప్రశ్నకు.. అల్లు అర్జున్ అని బదులు ఇచ్చింది సమంత. ఆయనతో కలిసి మరోసారి నటించాలని ఉంది అంటూ మనసులో మాట బయట పెట్టేసింది సామ్. ఇటీవల కాలంలో యాక్టింగ్ బీస్ట్ గా బన్నీ ట్రాన్స్ఫార్మ్ కావడంతోనే సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అనేది తెలుస్తుంది. అయితే సమంత అల్లు అర్జున్ తో కలిసి సన్నాఫ్ సత్యమూర్తి అని సినిమాలో నటించింది. పుష్ప లో అల్లు అర్జున్తో కలిసి ఉ అంటావా మావా అనే పాటలో ఆడి పాడింది ఈ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: