హీరోగా నటించడం పై క్లారిటీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ఏం చెప్పారంటే?

Anilkumar
టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢీ షోతో కెరీర్ స్టార్ట్ చేసి ఎంతో కష్టపడి తన టాలెంట్ తో అదే ఢీ షో కి జడ్జిగా వ్యవహరించే స్టేజికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్నాడు. ఓ వైపు సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తూనే మరోవైపు బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఢీ షోతో పాటూ ఇటీవల పలు కామెడీ షోలకి కూడా జడ్జిగా పనిచేశారు శేఖర్ మాస్టర్. 

ఈ క్రమంలోనే ఆ మధ్య స్టార్ మా లో ప్రసారమైన కామెడీ స్టార్స్ షోకి జడ్జ్ గా వ్యవహరించిన శేఖర్ మాస్టర్ కి శ్రీముఖి ఏకంగా ముద్దు పెట్టింది. ఇదే విషయమై శేఖర్ మాస్టర్ తాజా ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. " టీవీల్లో కనపడే వాళ్ళకి కచ్చితంగా అలాంటి ఛాన్స్ వస్తుంది అలా అని నేనేదో సూపర్ ఉన్నాను, నావల్ల వచ్చిందని అనుకోవడం నాకు తెలిసి అది తప్పు. నన్ను కూడా హీరోగా చాలామంది అడిగారు. కానీ మన జాబ్ అదికాదు. నా గురించి నాకు తెలుసు నేను ఎంతవరకు చేస్తానో. నేను హ్యాపీగా కొరియోగ్రఫీ చేసుకుంటాను.

 హీరో తప్పా వేరే దానికి వెళ్లొచ్చు. డైరెక్షన్ సైడ్ వెళ్లే స్కోప్ ఉండొచ్చు. కానీ హీరో అనేది కంప్లీట్ డిఫరెంట్ నేను దానికి సెట్ కాను" అని అన్నారు. డ్యాన్స్ షోస్ కి వచ్చేసరికి డాన్సుల్లో డబుల్ మీనింగ్ ఏమి ఉండదు. డాన్స్ అంటే ఓన్లీ డాన్స్ మాత్రమే ఉంటుంది. డాన్స్ బాగుంటే కరెక్ట్ గా జడ్జ్ చేస్తాం. కామెడీ స్కిట్స్ విషయానికొస్తే.. స్కిట్స్ లో ఏదో చిన్న మసాలా ఉంటేనే కామెడీ పండుతుందని వాళ్ళు అలా చేస్తారు.అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: