మూవీ రివ్యూస్ పై యంగ్ కమెడియన్ రియాక్షన్

Anilkumar
'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో టాలీవుడ్ కి కమెడియన్ గా పరిచయమయ్యాడు అభినవ్ గోమటం. సినిమాలో ఇతని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన కమెడియన్స్ లో అభినవ్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ తో పాటు కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా హీరోగా మారి 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మూవీ రివ్యూస్ పై అందరిలాగే తనవైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

అయితే ఈ విషయంలో అభినం గోమటం కాస్త డిఫరెంట్ గా రెస్పాండ్ అవ్వడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. గురువారం లేదా శుక్రవారం సినిమా రిలీజ్ అయితే కనీసం సోమవారం వరకు మీడియా వాళ్ళు రివ్యూస్ ని హోల్డ్ లో పెట్టాలని చెప్పాడు అభినవ్. అది కూడా ఓ నలుగురు హీరోల సినిమాలకు మాత్రమే అని అన్నాడు. వాళ్లెవరో కాదు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు హీరోల సినిమాలకి సంబంధించి మీడియా కనీసం సోమవారం వరకు రివ్యూస్ ని హాల్డ్ లో పెట్టాలని చెప్పుకొచ్చాడు. ఈ నలుగురు స్టార్స్ తెలుగు సినిమాకి, సినీ కార్మికులకి ఎన్నో

సేవలను అందించారాని అందుకే వాళ్ల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కనీసం సోమవారం వరకు మీడియా రివ్యూస్ ని ప్రచురించడం మానుకోవాలని అభిప్రాయపడ్డాడు. రివ్యూలపై ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. అలాగే అభినవ్ గోమటం సైతం ఈ విధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రివ్యూల విషయంలో అభినవ్ అందరిలా కాకుండా పూర్తి విభిన్న తరహాలో ఆలోచించడం విశేషం అనే చెప్పాలి. ఇక 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమా విషయానికొస్తే.. తిరుపతి రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా వైశాలి రాజ్‌ నటించారు. అలీ రెజా, మెయిన్‌, నిళగల్ రవి, రాకెట్‌ రాఘవ, లావణ్య రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. తరుణ్‌ భాస్కర్‌ గెస్ట్ గా మెరిశాడు. కాసుల క్రియేటివ్‌ వర్క్స్ బ్యానర్‌పై భవాని కాసుల, అరీం రెడ్డి అండ్‌ ప్రశాంతి వి నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: