అప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు హృతిక్ రోషన్.. మరింత ఆలస్యంగా వార్ 2..!?

Anilkumar
బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ  తెరకెక్కిస్తున్న చిత్రం వార్‌ 2. హృతిక్‌ రోషన్  టైగర్‌ ష్రాఫ్‌ కాంబోలో వచ్చిన వార్‌కు కొనసాగింపుగా వస్తున్న ఈ ప్రాజెక్టులో జూనియర్ ఎన్టీఆర్‌ జాయిన్ కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవలే వార్‌ 2 షూటింగ్‌ స్పెయిన్‌లో నిర్వహించినట్టు అప్‌డేట్ వచ్చింది. ఈ షెడ్యూల్‌లో షూట్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్స్‌ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ  తెరకెక్కిస్తున్న  వార్2 సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న హృతిక్ రోషన్ కాలికి  గాయమైందని సమాచారం అందుతుండటం గమనార్హం. 

ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. తన సినిమాలలో నటిస్తున్న కీలక నటులకు గాయాలు కావడం వల్ల ఎన్టీఆర్ సినిమాలు వాయిదా పడుతున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హృతిక్ రోషన్ బెల్ట్ పట్టుకుని క్రచెస్ సహాయంతో నిలబడిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ సినిమాలకే ఎందుకిలా అంటూ ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. హృతిక్ రోషన్ గాయం వల్ల బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ  తెరకెక్కిస్తున్న వార్2 సినిమా ఆలస్యం అయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

మరోవైపు ఇకపై స్పై యూనివర్స్ లో తెరకెక్కే అన్ని సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా కనిపిస్తారని తారక్ పాత్ర ప్రధానంగా ఒక సోలో ఫిల్మ్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దేవరతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో పాపులర్ మలయాళ యాక్టర్‌ షైన్ టామ్‌ చాకో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: