ఈ వయసులో అలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అంటున్న సురేఖ వాణి..!?

Anilkumar
ఇటీవల కాలంలో కేవలం హీరోయిన్స్ మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా వారి గ్లామర్ తో కూడా ఊహించిన విధంగా ఆకట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక పలు తెలుగు సినిమాలతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సురేఖ వాణి అప్పుడప్పుడు తన గ్రామర్ తో ఊహించని విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మొదట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్నపాటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలైన సురేఖ వాణి సినీ ప్రయాణం ఆ తర్వాత సినిమాల్లో గుర్తించదగిన పాత్రలలో కనిపించే వరకు వచ్చింది.

కేవలం ఫ్యామిలీ రోల్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మంచి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రల్లో కూడా సురేఖవాణి కనిపించింది. ఇక ఆమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉన్న పాత్రలు చేసుకుంటూ వెళుతుంది. సురేఖ వాణి సినిమాల్లో చాలావరకు ట్రెడిషనల్ లుక్ తోనే కనిపిస్తూ హైలెట్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటినుంచి కూడా ఆమె ఊహించిన విధంగా దర్శనమిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.  

ఇలా అలా ఉంటే సురేఖావాణి, తన కూతురు సుప్రీతతో కలిసి ఒక యూట్యూబ్‌ ఇంటర్వూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుప్రీత మాట్లాడుతూ.. నాకోక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటే.. నాక్కూడా ఓ బాయ్ ఫ్రెండ్ కావాలన్నారు సురేఖా వాణి. అంతేకాదు మంచి మనస్సు ఉన్న వ్యక్తి అయ్యి ఉండి.. హైట్ అండ్ నైస్ ఫిజిక్ ఉండాలని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: