ఆ విషయం లో చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన లారెన్స్..!?

Anilkumar
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో ఇండస్ట్రీ రికార్డుల దుమ్ము దులిపేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఇంద్ర మూవీ ఒకటి… 2002 టైంలో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించిన ఈ సినిమా… ఇప్పటికీ మెగాస్టార్ కెరీర్ లో లాస్ట్ 20-24 ఏళ్లలో బెస్ట్ కమర్షియల్ మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగ్ ఆ తర్వాత కలిపిందే. ‘తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని వెళ్తున్నా, లేకపోతే తలలు తీసుకెళ్ళేవాడిని’ అనే డైలాగ్ ఇప్పటికీ పాపులర్ డైలాగే..

అలాగే షూటింగ్ సమయంలోనే కొన్ని డైలాగ్స్ రాసి ఆశ్చర్య పరిచారు పరుచూరి బ్రదర్స్. ఇంద్ర సినిమాలో చిరంజీవి వేసిన దాయిదాయిదామ్మ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో చిరంజీవి వేసిన వీణ స్టెప్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సాంగ్ కు రాఘవ లారెన్స్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడం జరిగింది. అయితే ఒక సందర్భంలో లారెన్స్ మాట్లాడుతూ చిరంజీవి టాలెంట్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దాయి దాయిదామ్మా సాంగ్ కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లామని అక్కడ మేమంతా పార్క్ లో కూర్చుని ఉన్నామని లారెన్స్ వెల్లడించారు.

ఆ సమయంలో చిరంజీవి గారు రిహార్సల్స్ చేశావా అని అడగగా చేశానని చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసి చూపించాలని కోరగా పది మూమెంట్స్ చేసి చూపించానని లారెన్స్ అన్నారు. నేను వీణ స్టెప్ వేసిన వెంటనే చిరంజీవి గారు మరోసారి చెయ్యాలని కోరారని చెప్పాడు. చిరంజీవి గారు వీణ స్టెప్ చేసే సమయంలో రెండుసార్లు చెయ్యి పట్టుకున్నానని మూడోసారి మాత్రం ఆయనే స్వయంగా చేశారని లారెన్స్ తెలిపారు. ఆ సమయంలో చిరంజీవి నాకంటే అద్భుతంగా డ్యాన్స్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు లారెన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: