సమయం లేదు జగన్.. ఇప్పటికైనా ఆ రెండు పనులు చేస్తే వైసీపీకి 130 సీట్లు పక్కా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా కూటమి నేతలు ఎక్కువ హామీలను ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందో రాదో అనే టెన్షన్ వైసీపీ నేతల్లో ఉంది. జగన్ కొత్త పథకాలను ప్రకటించకుండా నవరత్నాలు ప్లస్ పేరుతో అవే స్కీమ్స్ ను ప్రకటించడం విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇప్పటికైనా సమయం మించిపోలేదని రైతులకు, డ్వాక్రా మహిళలకు చెరో 50 వేల రూపాయల చొప్పున రుణమాఫీ ప్రకటించి ఐదు విడతలలో ఆ స్కీమ్ ను అమలు చేస్తానని ప్రకటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్స్ ను అమలు చేయడానికి మరీ ఎక్కువ మొత్తం కూడా ఖర్చు కాదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ ఇప్పటికైనా ఇప్పటికైనా ఆ రెండు పనులు చేస్తే వైసీపీకి 130 సీట్లు పక్కా అని విశ్లేషకులు చెబుతున్నారు
 
50 వేల రూపాయల రుణమాఫీ ప్రకటించడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశం కూడా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం అమలు చేస్తున్నస్కీమ్స్ తో పోల్చి చూస్తే ఒక్కో వ్యక్తికి మరో 10 వేలు బెనిఫిట్ కలిగేలా మరో రెండు పథకాలను ప్రకటించడం వైసీపీకి రిస్క్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఇప్పటికైనా ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.
 
వైసీపీ ఇప్పటికీ 100కు పైగా స్థానాలలో విజయం దక్కుతుందని భావిస్తోంది. వైసీపీకి ఈ ఎన్నికలు కీలకం కానుండగా వైసీపీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. వైసీపీ ఈ ఎన్నికల్లో 175 స్థానాలలో ఎన్ని స్థానాలలో సత్తా చాటుతుందో చూడాలి. జగన్ తాజాగా ఇచ్చిన  ఒక ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా పొలిటికల్ లెక్కల్ని మాత్రం మార్చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ మాత్రం ఈ ఎన్నికల్లో తమ పార్టీ రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: