రాజా సాబ్: రెమ్యూనరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. ఎంతంటే..?
టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఒక్కో చిత్రానికి ప్రభాస్ రూ.150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కానీ రాజా సాబ్ సినిమాకి మాత్రం కేవలం రూ.100 కోట్ల రూపాయల తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జోనర్ చేంజ్ అలాగే సినిమాలో భారీ సెట్స్ కోసం ఖర్చయినందువల్ల రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనే నిర్ణయం ప్రభాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మారుతి రూ.18 కోట్లు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రూ.5 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, మాళవికా మోహన్ రూ. 2 కోట్లు, రిద్ది కుమార్ రూ.3 కోట్లు తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇలా మొత్తం మీద సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు దాటినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజా సాబ్ సినిమాకి సంబంధించి ఈరోజు ఉదయం షోల నుంచి అదనంగా 8 నిమిషాల పాటు కొన్ని సీన్స్ ని యాడ్ చేశారు చిత్ర బృందం. ఈ సీన్స్ కి సంబంధించి ఇటీవల ప్రోమో అని కూడా విడుదల చేయగా అభిమానులను ఆకట్టుకుంది. మరి థియేటర్లో ఎలాంటి కొత్త సీన్స్ యాడ్ చేశారనే విషయం మాత్రం తెలియాలి అంటే థియేటర్స్ కి వెళ్లాల్సిందే. ప్రభాస్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, డైరెక్టర్ హను రాఘవపూడి తో ఫౌజి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా సలార్ 2, కల్కి 2 చిత్రాలతో పాటు రాజా సాబ్ 2 కూడా ఉండబోతోంది.