ది రాజా సాబ్ ఎఫెక్ట్..ఆ డైరెక్టర్ తో మూవీ క్యాన్సిల్ చేసుకున్న ప్రభాస్.?

Pandrala Sravanthi
ప్రభాస్ ఎప్పుడైతే మారుతి తో సినిమా చేస్తానని ఒప్పుకున్నారో అప్పటినుండి ఆయన ఫ్యాన్స్ చాలా భయపడ్డారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ దర్శకులతో సినిమాలు ఒప్పుకుంటున్న ప్రభాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి.. చిన్న దర్శకుడుతో సినిమా ఎలా ఉంటుందోనని భయపడ్డారు. కానీ మరి కొంతమందేమో ప్రభాస్ కి స్టోరీ మీద ఎంత నమ్మకం ఉంటే అంత చిన్న డైరెక్టర్ కి డేట్స్ ఇస్తారు అని అన్నారు. కానీ మొత్తానికైతే ప్రభాస్ అభిమానులు ముందు నుండి ఏ విధంగా అయితే భయపడ్డారో అదే జరిగింది. ది రాజాసాబ్ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాఫ్ అయింది. దాంతో రాజాసాబ్ మూవీకి దర్శకత్వం చేసిన మారుతిని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ తిట్టుకుంటున్నారు.వాడిని ఇంటికి వెళ్లి కొట్టాలి అని తెగ ఫైర్ అవుతున్నారు. 


అంతేకాదు రాజా సాబ్ ఈవెంట్ లో సినిమా బాలేక పోతే నా ఇంటి అడ్రస్ ఇస్తున్నానని ఆయన ఉండే అడ్రస్ కూడా ఇచ్చారు. దీంతో కొంతమంది ప్రభాస్ అభిమానులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. చిన్న దర్శకుడితో సినిమా వద్దంటే వినలేదు.ఇప్పుడు భారీ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నారంటూ మండిపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ అంత పేరున్న వాడు కాకపోయినా కథ నచ్చి ప్రభాస్ సినిమాకి ఒప్పుకున్నారు. అదంతా మొహమాటానికి పోయి ప్రభాస్ చేసిన తప్పే.అయితే గతంలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారని ప్రచారం జరిగింది.

 ఇప్పటివరకు ఒక్క సినిమాకి కూడా డైరెక్షన్ చేయని ప్రేమ్ రక్షిత్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సినీ వర్గాల్లో నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ ప్రేమ్ రక్షిత్ తో చేసే సినిమాని కాన్సిల్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. దానికి కారణం తాజాగా వచ్చిన రాజాసాబ్ ఫలితమే. మొహమాటానికి పోయి మారుతితో సినిమా చేయడానికి ఒప్పుకుంటే ప్రభాస్ కి పెద్ద షాక్ తగిలింది.ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ తో కూడా అలాగే మొహమాటానికి పోయి ఒప్పుకుంటే తెలిసి తెలిసి బావిలో పడ్డట్టే అని ప్రభాస్ రియలైజ్ అయ్యి ప్రేమ్ రక్షిత్ తో సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది.అలాగే ప్రేమ్ రక్షిత్ మొదట రెండు మూడు సినిమాలు చేశాక ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకొని అప్పుడు ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకుంటారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: