ప్రభాస్ సినిమా ఫ్లాప్.. సంక్రాంతి విన్నర్ ఆ మూవీ నేనా.?

Pandrala Sravanthi
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన భారీ అంచనాలతో విడుదలైన ది రాజా సాబ్ మూవీ సంక్రాంతి బరిలో నిలిచి అట్టర్ ప్లాఫ్ అయింది. ప్రీమియర్స్ చూసిన వారు ఈ సినిమా అస్సలు బాలేదని రివ్యూలు ఇచ్చేశారు. ఇక ఈ సినిమా ఫస్ట్ షో పడడంతోనే నెగటివ్ టాక్ రావడంతో సినిమా డిజాస్టర్ అయిందని పలువురు మౌత్ టాక్ ద్వారా తెగ స్ప్రెడ్ చేశారు.అంతేకాకుండా కొంతమందేమో డిజాస్టర్ రాజాసాబ్ అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడంతో పాటు డైరెక్టర్ మారుతిని బూతులతో తెగ వేసుకున్నారు.ఇదంతా పక్కన పెడితే సంక్రాంతి బరిలో నిలిచిన ది రాజాసాబ్ మూవీ సంక్రాంతి విన్నర్ అయ్యి రెబల్ స్టార్ అభిమానులు కాలర్ ఎగరవేసుకునేలా చేస్తుంది అనుకుంటే మొదట్లోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని భారీ డిజాస్టర్ అయింది.


 దాంతో సంక్రాంతి బరిలో నెక్స్ట్ నిలిచే సినిమాల పైన అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. అయితే సంక్రాంతి బరిలో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారి నారి నడుమ మురారి వంటి సినిమాలు ఉన్నాయి. అయితే వీటన్నింటిలో సంక్రాంతి విన్నర్ గా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ నిలుస్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలామంది సినీ ప్రేక్షకులు కూడా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమానే అని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాబోయే సినిమాల్లో అంతో ఇంతో అంచనాలు ఉన్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు మాత్రమే..


అయితే రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా బరిలో ఉన్నప్పటికీ రీసెంట్గా రవితేజ నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాఫ్ అవ్వడంతో ఈ సినిమాపై అన్ని అంచనాలు అయితే లేవు.ఇక నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమాలో కూడా కామెడీ అద్భుతంగా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూస్తే అర్థమవుతున్నప్పటికీ వీటన్నింటిలో మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి మాత్రమే భారీ హైప్ ఉంది. దాంతో ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమానే అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: