ఏపీ: పండగ వేళ చంద్రబాబుతో చిరంజీవి కీలక భేటీ..??

Suma Kallamadi

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. అంటే ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఈ ఎన్నికలకు సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు తెగ హీట్ ఎక్కుతున్నాయి. గంట గంటకు కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వేస్తున్న ఎత్తులను అందరూ నిశితంగా పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ ఇటీవల టీవీ9కి ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చి చాలా విషయాల గురించి మాట్లాడారు. కుటుంబ సమస్యలు, వివేకా హత్య కేసు, కేంద్ర రాజకీయాలు, బీజేపీతో ఉన్న సంబంధం గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు కూడా ఏబీఎన్ రాధాకృష్ణకు పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇలాంటి ఆసక్తికర పరిణామాలు రీసెంట్ టైమ్‌లోనే చకచకా జరిగిపోయాయి. అయితే నెక్స్ట్ టూ డేస్ లో అంతకు మించిన ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఏపీకి పయనం అయినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన ఏపీకి చేరుకుని మే 10వ తేదీన అంటే అక్షయ తృతీయ నాడు చంద్రబాబును మీట్‌ కానున్నట్లు రిపోర్టు పేర్కొంటున్నాయి.
చంద్రబాబుతో సమావేశం అయిపోయాక మీడియాని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడే అవకాశం ఉంది. దీని తర్వాత మే 11వ తేదీన పిఠాపురంలో క్యాంపెనింగ్ చేయనున్నారని సమాచారం. చిరు పక్కనే తమ్ముడు పవన్ కళ్యాణ్ ని పెట్టుకొని ఎన్నికల ప్రచారాన్ని చేస్తారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు అయిన మే 11న చిరంజీవి రంగంలోకి దిగితే పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సులు పెరుగుతాయి.
చిరంజీవి గత ఐదేళ్లుగా వైసీపీతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కానీ ఇటీవల ఆయన టీడీపీ కూటమికే మద్దతు ఇస్తున్నట్లు పబ్లిక్‌గా ప్రకటించారు. జనసేన పార్టీకి ఐదు కోట్లను కూడా అందించారు. పవన్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. రేపు చంద్రబాబుతో జరిగే మీటింగ్ తో ఆయన టీడీపీ+ యాక్టివిస్ట్ అయిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: