కోరి వ‌చ్చిన ప‌వ‌న్ కావాలా.... సీట్లిచ్చిన జ‌గ‌న్ కావాలా ?

RAMAKRISHNA S.S.
రాష్ట్రంలో పోలింగ్ ముగిసినా.. దీనికి సంబంధించిన చ‌ర్చ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ముఖ్యంగా అధిక సంఖ్య‌లో ఉన్న కాపు సామాజిక వ‌ర్గం ఎటువైపు నిలిచింది?  ఎటువైపు వారు మొగ్గు చూపించారు? అనేది ఆస‌క్తిగా మారింది. ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాలు స‌హా.. సీమ‌లోని బ‌లిజ‌ సామాజిక  వ‌ర్గం ఓట్ల‌పై జ‌న‌సేన పార్టీ స‌హా కూట‌మి పార్టీలు ఆశ‌లు పెట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ సామాజిక వ‌ర్గాన్ని సంతృప్తి ప‌రిచేలా.. తిరుప‌తి సీటును కూడా ఆర‌ణి శ్రీనివాసులుకు కేటాయించారు.

అదేవిధంగా మ‌రికొన్ని సీట్ల‌ను కూడా కాపుల‌కు కేటాయించారు. పైగా.. ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌వేశంపై.. కాపుల కు ఎన్నో ఆశ‌లు, ఆకాంక్ష‌లు కూడా ఉన్నాయి. దీంతో వీరి ఓట్ల‌పై పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు. పైగా ప‌వ‌న్ ప్ర‌చారం.. రాష్ట్రం కోసం.. తాను ఎంతో కృషి చేస్తున్నార‌ని చెప్ప‌డం.. ఇదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న నిప్పులు చెరిగిన తీరు వంటివి చ‌ర్చ‌కు వ‌చ్చాయి. కాపులు కూడా ఆయ‌న‌కు ఓన్ అయ్యా రు. ముఖ్యంగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. వైసీపీలోకి చేరిపోయిన త‌ర్వాత మ‌రింత‌గా ప‌వ‌న్‌కు ద‌న్ను పెరి గింది.

ఇది ఒక వైపు చ‌ర్చ‌గా మారితే.. మ‌రోవైపు.. కూట‌మిక‌న్నా కూడా వైసీపీనే ఎక్కువ‌గా కాపుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం, మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం వంటివి ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో కూట‌మి పార్టీలు వెనుక‌బ‌డ్డాయ‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. అంటే. .కూట‌మి వైపు ప‌వ‌న్‌.. ఉంటే.. వైసీపీ వైపు సామాజిక వ‌ర్గం ప‌రంగా జ‌రుగుతున్న స‌మీక‌ర‌ణ‌లు వంటివాటిపై ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది.

దీంతోవైసీపీవైపు ఎక్కువ‌గా పోలింగ్ జ‌రిగింద‌ని.. ముఖ్యంగా కాపు మ‌హిళ‌లు వైసీపీ వైపు ఉన్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. కాపు నేస్తం పేరుతో ఏటా ఇస్తున్న సంక్షేమం మ‌హిళ‌ల‌ను వైసీపీ వైపు మ‌ళ్లించి ఉంటుంద‌ని చెబుతున్నారు. యువ‌త‌, కాపు విద్యార్థులు, పురుషుల ఓట్లు ప‌వ‌న్ వైపు ప‌డి ఉంటాయ‌ని మ‌రో చ‌ర్చ సాగుతోంది. ఎలా చూసుకున్నా.. రాజ‌కీయాల్లోకి కోరి వ‌చ్చిన ప‌వ‌నా?  లేక‌.. కాపుల‌కు ఎక్కువ‌గా  సీట్లిచ్చిన జ‌గ‌నా? ఎవరివైపు కాపులు నిల‌బడ్డార‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి ఊహాగాన‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: