ప్రభాస్ కల్కి పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకంటే..!?

Anilkumar
సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు వైజయంతి మూవీస్ ను రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే.. అసలు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? అనుకున్న తేదీకి దీన్ని విడుదల చేస్తారా..? ఇప్పటికే మే నెల చివరాఖరికి వచ్చేసింది.. జూన్ కూడా త్వరలోనే రాబోతోంది.. మరి కల్కి సినిమా ప్రమోషన్స్ సంగతేంటి..? ఎట్టి పరిస్థితుల్లో సినిమాని అనుకున్న తేదీకి విడుదల చేస్తారా అని సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇక దీనికి

 మేకర్స్ ఇస్తున్న సమాధానం ఏంటంటే.. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అనుకున్న తేదీ న జూన్ 27 కే విడుదల చేస్తాము అని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని గత కొద్ది రోజుల ముందు దర్శక నిర్మాతలు అన్నారు.  ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తన పర్సనల్ ట్రిప్ ను కూడా క్యాన్సిల్ చేసుకుని తన పూర్తి డేట్స్ ఇప్పుడు కల్కి సినిమా కోసమే కేటాయిస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ప్రస్తుతం కల్కి సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే షూటింగ్ సంగతి బాగానే ఉన్నప్పటికీ సినిమా ప్రమోషన్ విషయం అడిగితే మాత్రం అసలు స్పందించడం లేదు మేకర్స్. ఇప్పటికే కల్కి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది అని ఎప్పటినుండో ప్రచారం చేస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం దీనిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇక మిగతా సినిమాల విషయానికి వెళితే పుష్పటు సినిమాకి ఇంకా చాలా నెలల సమయం ఉంది. కానీ నాలుగు నెలలకు ముందే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. అలాగే దేవర సినిమా విడుదలకి ఇంకా ఐదు నెలల సమయం ఉంది. ఇంతలోపే ఈ సినిమాలో నుండి కూడా ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ తెలియక పోయినప్పటికీ పాట విడుదల చేశారు. కానీ కల్కి నుండి ఇప్పటివరకు ఒక్క అనౌన్స్మెంట్ కూడా రాకపోవడంతో ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: