వైరల్ గా మారిన దుల్కర్ సల్మాన్ కామెంట్స్..!!

murali krishna
టాలీవుడ్ క్రేజీ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. సీతారామం సినిమాతో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ నటన, అందంతో పాటు తన మాటకారి విధానంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు అయినా సరే సినీ బ్యాగ్రౌండ్ ఎంత ఉన్న దానిని ఉపయోగించకుండా ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను తెచ్చుకున్నాడు. నిజానికి దుబాయ్ లో జాబ్ చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్న దుల్కర్‌కు చిన్నపటి నుంచి యాక్టర్ కావాలనే కల ఉండేదట. అయితే ఆయన తండ్రికి దుల్కర్ సల్మాన్ నటుడు అవ్వడం ఇష్టం లేదు. దుల్కర్ కి సినిమా వాతావరణం మొదటి నుంచి దూరంగానే ఉంచాలని చూస్తూ ఉండేవాడట.
కానీ నటన తమ బ్లడ్ లోనే ఉంటుందనట్లు నటుడి కొడుకు చివరికి మళ్ళీ నటుడే అయ్యాడు. పెళ్లి చేసుకుంటే ఆయన మారుతాడని మమ్ముట్టి భావించాడు.మలయాళ నటుడు మమ్ముట్టి, సల్ఫాత్‌ల కుమారుడు దుల్కర్ అందరికీ సుపరిచితమే. తెలుగులో మహానటి, అందమైన జీవితం, ఓకె బంగారం, సీతారామం వంటి సినిమాల్లో నటించాడు.కానీ సీతారామం సినిమా తర్వాతనే ఇతనికి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీతోనే ఒక మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా దుల్కర్ స్టేజ్ పైన తన భార్య గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2011లో దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీకి రాకముందే అమల్ అనే ఒక నార్త్ ఇండియన్ ముస్లిం కుటుంబం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందగాడికి మరొక అందగత్తె తోడుగా దొరికింది అన్నట్టుగా వీరి బంధం నడుస్తుంది. అయితే తన జీవితంలో అమల్ స్థానం ఎంతో గొప్పదని, ఆమె నా జీవితంలోకి వచ్చాకే నా సినిమా కెరీర్ కూడా మొదలైంది అని ఆమె నా అదృష్ట దేవత అని ఆమె ప్రోత్సాహంతోనే 'సెకండ్ షో' అనే సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేశాను.. ఆమె లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేను. ఆమెతో నేను పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. ఆమెను కాకుండా మరొక అమ్మాయిని నా జీవితంలో ఊహించుకోలేను అంటూ ఒక స్టేజ్ పై దుల్కర్ తన భార్య మీద ఉన్న ప్రేమను బయటపెట్టారు. కాగా వీరికి 2017 లో ఒక పాప పుట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: