అరణ్మణై 4: తమిళ్ లో ఫస్ట్ హిట్?

Purushottham Vinay
తమిళనాడులో అనూహ్యంగా అరణ్మణై 4 హిట్ అయ్యింది. దీంతో అక్కడ ఈ ఏడాది ఫస్ట్  హిట్ పడింది.తమిళనాట అరణ్మణై 4 సినిమా మొదటి వారం రోజుల్లో ఏకంగా మొత్తం రూ.55 కోట్ల వసూళ్లు నమోదు చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్‌ ది పాన్‌ ఇండియా అయ్యింది. ఈ మధ్య కాలంలో తమిళనాడులో వచ్చిన ఏ మిడ్‌ రేంజ్ మూవీ కూడా ఈ స్థాయిలో వసూళ్లు నమోదు చేసింది లేదు. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం అరణ్మణై 4 ని హిట్ చేసి ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌ సినిమాలను తెలుగు ప్రజలు తీసి పక్కన పడేసినా తమిళ ప్రేక్షకులు మాత్రం సాంబార్ లాగా ఆధరిస్తారు అంటూ మరోసారి నిరూపితం అయ్యిందని బాక్సాఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తమిళ్ లో ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అరణ్మణై 4 ను తెలుగు లో బాక్ గా విడుదల అయ్యింది. ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు అయిన తమన్నా, రాశి ఖన్నా లకు తెలుగు లో మంచి గుర్తింపు ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.


కానీ ఈ రొట్ట అరవ డబ్బింగ్‌ మూవీని తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు. బాక్‌ గా తెలుగు లో డబ్‌ చేసినా, ఇద్దరు అల్ట్రా హాట్  ముద్దుగుమ్మలు ఉన్నా కూడా ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టలేదు. తమిళనాట రూ.50 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.50 లక్షల షేర్‌ ను కూడా రాబట్టలేక పోయింది అంటూ బాక్సాఫీస్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.మిల్కీ బ్యూటీ తమన్నా మరియు అందాల రాశి ఖన్నా లు కలిసి నటించినా కూడా తెలుగు జనాలు పట్టించుకోలేదు. కానీ ఈ మూవీలో అచ్చో అనే పాటకి మాత్రం వ్యూస్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. దానికి కారణం తమన్నా, రాశి ఖన్నాలా అందాల ఆరబోత. ఇద్దరు నువ్వా నేనా అనే రేంజ్ లో రెచ్చిపోయి హాట్ షో చేశారు. అయితే కామెడీ తో పాటు హర్రర్‌ ఉండే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు లైట్‌ తీసుకోవడం తో పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదని సమాచారం అందుతోంది. ఇలాంటి సినిమాలు తమిళ్ లో తప్ప తెలుగులో ప్రేక్షకులు పెద్దగా చూడరు అనే విషయం వసూళ్ళని బట్టి పూర్తిగా అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: