ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ది కేరళ స్టోరీ.. ఎప్పుడంటే..!?

Anilkumar
బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన కేరళ స్టోరీ సినిమా విడుదలై ఎనిమిది నెలలు దాటినప్పటికీ ఓటీటీ లోకి ఇంకా రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఓటిటి సంస్థ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం చేశారు. కాగా ఈ సినిమా ఈనెల 16 నుండి ప్రముఖ ఓటిటీ లో  జీ 5 లో  స్ట్రీమింగ్ జరగనుంది. ఇక  ఈ సినిమా విషయానికి వస్తే.. కేరళ రాష్ట్రంలో జరిగిన  లవ్ జిహాద్ కారణంగా బలైన హిందూ క్రిస్టియన్ అమ్మాయిలు ఎలా ట్రాప్ లో పడ్డారు.  ఆ తర్వాత సెక్స్ బానిసలుగా ఎలా మారారు..

అలా మారినా కేరళ అమ్మాయిల నిజ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తీశారు. సందీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను చాలా రీసెర్చ్ చేసి మరీ తీశారు.ఈ చిత్రాన్ని విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఈ సినిమాలో ఓ వర్గం వారికి కించపరిచేలా ఉందని అప్పట్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బంగాల్ వంటి ప్రభుత్వాలు ఈ సినిమాను అక్కడ రిలీజ్ కాకుండా అడ్డుకున్నాయి. తీరా సుప్రీంకోర్టు జోక్యంతో అక్కడ ఈ సినిమాలు ఆయా రాష్ట్రాల్లో విడుదలయ్యాయి. మంచి విజయాన్ని సాధించాయి. 'ది కేరళ స్టోరీ' సినిమాను లవ్ జిహాద్ పేరిట 32 వేలకు పైగా అమాయకులైన హిందూ,

క్రిష్టియన్ అమ్మాయిలను ఇస్లామ్ మతంలోకి మార్చి వారిని ఐసిస్ క్యాంపుల్లో పంపించి వారిని దేశ వ్యతిరేకులుగా ఎలా మారుస్తున్నారనే విషయాన్ని కేరళ స్టోరీ మూవీలో చక్కగా ఆవిష్కరించారు దర్శకుడు. కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పేమి కాదు. మన దగ్గర ఎంతో మంది మతాంతర వివాహాలు చేసుకున్న వారు సంతోషంగా ఉన్నారు. కానీ లవ్ జిహాద్ పేరిట ప్రేమించిన అమ్మాయిలను ఐసీస్ క్యాంపుల్లో చేర్పించి వారిని అక్కడ సెక్స్ బానిసలుగా మార్చడం.. వారు అప్పటి వరకు ఆరాధించిన మతాన్ని ద్వేషించేలా చేయడాన్నే అందరు తప్పు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: