మృణాల్ ఠాగూర్ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్..!

Anilkumar
చాలా తక్కువ సమయంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది మృణల్ ఠాగూర్. ఇక ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీతారామం సినిమాలో హీరోయిన్గా నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకుంది. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది ఈ బ్యూటీ. సీతారామం సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీత అనే పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో తన అందం అభినయం అందరినీ కట్టి పడేసాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఆ చీరకట్టు లో తన హుందాతనం చూపిస్తూ యువరాణి లాగా తన నటించిన యువరాణి పాత్రకు న్యాయం చేసింది ఈ బ్యూటీ. కాగా ఈ సినిమా ఎంతటి భార్య విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టులో చేరిన ఈ సినిమా పాటల విషయంలో కూడా అంతే ఆదరణను దక్కించుకుంది. . ఈ సినిమాలో పాటల్లో వచ్చే లిరిక్స్ అన్నీ కూడా ఈమె అందాన్ని ఆరాధించి లిరిసిస్ట్ లు రాసారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఆ పాత్రకు మృణాల్ తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరు అనే ముద్ర వేసింది మృణాల్. ఆ తర్వాత హాయ్ నాన్నచిత్రంలో యష్ణ అనే పాత్రలో నటించి మెప్పించింది.

ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది మృణాల్. టాలీవుడ్లో ఇంకా పెద్ద ఆఫర్లు వస్తున్నప్పటికీ మృణాల్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కొద్దిరోజుల నుండి ఈమె గ్లామర్ ఫొటోలతో దాడి చేస్తుంది. బికినీ లో లేదా క్లీవేజ్ షోలు ఇలా ఏదో ఒకరకంగా హైలెట్ గా నిలుస్తుంది మృణాల్. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి.. దీని తొందర ఠాగూర్ కి సంబంధించిన ఈ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: