బరువు తగ్గేందుకు ఆపరేషన్.. చివరికి ప్రాణం పోయింది?

praveen
నేటి ఆధునిక టెక్నాలజీ యుగంలో మనిషి జీవనశైలిలో ఎంత మార్పు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఒకప్పుడు ఏ పని చేయాలన్నా చెమటోడ్చేవాడు మనిషి. కానీ ఇప్పుడు ఇక ఇంట్లో కూర్చుని కనీసం ఒక క్యాలరీ కూడా కరగకుండానే అన్ని పనులు చేసేస్తూ ఉన్నాడు. టెక్నాలజీ కారణంగా మనిషికి శారీర శ్రమ అనేది లేకుండా పోయింది. ఇక నేటి రోజుల్లో చేసే ఉద్యోగాలు అన్నీ కూడా ఒకచోట గంటల తరబడి కూర్చొని చేసేదే ఉండడం గమనార్హం. దీంతో ఇక ఇలా కూర్చుండి కూర్చోండి మనుషులు ఊబకాయలుగా మారిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. భారీగా బరువు పెరిగిపోయి ఇక ఎన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 అయితే ఇక నేటి రోజుల్లో ఆహారపు అలవాట్లు కూడా ఇలా బరువు పెరిగిపోవడానికి కారణం అవుతున్నాయ్ అని చెప్పాలి. అయితే సాధారణంగా ఎవరైనా బరువు పెరిగిపోతే జిమ్ కు వెళ్లి వర్కౌట్స్ చేసి మళ్ళీ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ బాగా డబ్బున్న వాళ్ళు మాత్రం ఎలాంటి శారీరక శ్రమ లేకుండా.. బరువు తగ్గడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు బరువు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకుని చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎక్కువమంది సెలబ్రిటీలు ఇలా సర్జరీల వైపు ఎక్కువగా మగ్గుచూపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక సింగర్ బరువు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకుని చివరికి ప్రాణాలు కోల్పోయింది.

 బ్రెజిల్ కు చెందిన పాప్ సింగర్ డానిల్  అనే 42 ఏళ్ల మహిళ బరువు తగ్గడానికి లైఫో సెక్షన్ ఆపరేషన్ చేయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. చికిత్స తర్వాత ఆమె ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. అయితే తర్వాత ఆస్పత్రిలో చేరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉబకాయం బారిన పడిన వారు బరువు తగ్గేందుకు ఇక శరీరంలో పేరుకున్న అనవసరమైన కొవ్వును తొలగించేందుకు ఎంతో మంది లైఫో సక్షన్ సర్జరీలు చేయించుకుంటారు. అయితే శరీరం సహకరించక రక్తం గడ్డకట్టి మరణించిన వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: