పవన్ దర్శకత్వంలో లాంచ్ అయిన 'సత్యాగ్రహి' మూవీ.. ఏమైందో తెలుసా?

praveen
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు గతంలో దర్శకుడిగా రచయితగా కొరియోగ్రాఫర్ గా కూడా తనలో దాగి ఉన్న టాలెంట్ ని చూపించాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడంటే రాజకీయాలను సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. కానీ ఒకప్పుడు ఆయన పూర్తి దృష్టి మొత్తం సినిమాల మీదే ఉండేది. ఇక తన కెరియర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు పవన్ కళ్యాణ్.

 ఖుషి, గుడుంబా శంకర్ లాంటి మూవీస్ లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ ను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి.. ఇక ఆయనే తెరకెక్కించారు అని చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ మూవీలోని కొన్ని సన్నివేశాలకు కూడా దర్శకత్వం వహించారు  పవన్ కళ్యాణ్. పవన్ పూర్తిస్థాయి దర్శకుడిగా చేసిన మాత్రం జానీ సినిమా. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇక పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది.

 2003లో వచ్చిన ఈ మూవీ ఫ్లాప్ గానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే   అయితే జాని చిత్రీకరణ సమయంలోనే పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో సత్యాగ్రహి అనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఎం ఎం రత్నం నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది.  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు అని చెప్పాలి. అయితే ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయింది. అంతలోనే జానీ సినిమా విడుదలై ఫ్లాప్ అయింది. దీంతో పవన్ కళ్యాణ్ కి తన దర్శకత్వ ప్రతిభ పై సందేహం వచ్చిందట. జానీ మూవీ వల్ల డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు నష్టపోయారని గ్రహించారు పవన్ కళ్యాణ్. అది దృష్టిలో పెట్టుకుని తన వల్ల మరో నిర్మాత నష్టపోకూడదని సత్యాగ్రహి సినిమాని ఆపేశారట. ఈ విషయాన్ని ఒకానొక సమయంలో నిర్మాత ఎం ఎం రత్నం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: