విజయ్ వద్దన్నాడు.. విశాల్ ఓకే అన్నాడు.. చివరికి బ్లాక్ బస్టర్?

praveen
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం తరచూ జరుగుతూ వస్తుంది. కొన్ని కొన్ని సార్లు కొంతమంది హీరోలు కథ నచ్చక రిజెక్ట్ చేస్తే.. ఇంకొంతమంది డేట్స్ సర్దుబాటు కాక ప్రాజెక్టును వదులుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది కథలో మార్పులు కావాలి అంటూ కోరితే.. ఇక డైరెక్టర్లు అందుకు ఒప్పుకోకపోవడంతో.. ఇక కాంబినేషన్ మిస్ అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా మిస్ అయిన ప్రాజెక్టును మరో హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం చేస్తూ ఉంటాడు. అయితే తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఇళయ దళపతి విజయ్ కూడా ఇలాంటిదే జరిగిందట.

 ఆయన ఏకంగా ఒక ప్రాజెక్టును వదులుకోగా.. అదే మూవీలో నటించిన విశాల్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు అని చెప్పాలి. అయితే విశాల్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉండగా అందులో అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం పందెంకోడి సినిమా. విశాల్ రెండో చిత్రంగా వచ్చిన ఈ మూవీ ఏకంగా ఒకసారిగా విశాల్ ను మాస్ హీరోగా మార్చేసింది. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. లింగు స్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విషయాన్ని స్టార్ హీరోగా చేసేసింది అని చెప్పాలి. అయితే డైరెక్టర్ లింగు స్వామి ముందుగా విశాల్ తో ఈ మూవీ తీయాలని అనుకోలేదట.

 దళపతి విజయ్, జ్యోతికలను హీరో హీరోయిన్లుగా పెట్టి సినిమాను తీయాలని అనుకున్నాడట. అయితే విజయ్ కి కథ వినిపించగా.. సగం కథ విన్న తర్వాత కథ నచ్చలేదు అని చెప్పేసాడట. ఎందుకంటే సినిమా తొలి భాగంలో హీరో పాత్ర ఎంతో సైలెంట్ గా సాగుతుంది. అందుకే విజయ్ కి ఈ పాత్ర నచ్చలేదట.  విజయ్ సున్నితంగా తిరస్కరించాడట. దీంతో లింగస్వామి అక్కడ నుంచి వెనుతిరిగి విశాల్ కి కథ వినిపించడంతో అతను వెంటనే ఓకే చేశాడట. ఇక మీరా జాస్మిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. 2005లో పందెంకోడి సినిమా విడుదలై సూపర్ హిట్ కాగా 2018లో ఈ సినిమాకు సీక్వెల్  తెరకెక్కించారు. కానీ సీక్వల్ యావరేజ్ గానే నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: