సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న శ్రీలీల.. కారణమేంటో తెలుసా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే అందరూ కూడా శ్రీ లీల పేరు చెబుతున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాలోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజ సరసన ధమాకా అనే సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టింది. దీంతో ఈ సినిమా శ్రీ లీల  కెరియర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఏకంగా స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ అమ్మడి వైపు చూసేలా చేసింది అని చెప్పాలి.

 ఏకంగా ప్రస్తుతం నిమిషం కూడా తీరికలేకుండా వరుసగా సినిమా షూటింగ్లలో పాల్గొంటూ బిజీబిజీగా ఉంటుంది శ్రీ లీల. దాదాపు నెలకు ఒక సినిమాతో ఇక థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇక గత కొన్ని రోజుల నుంచి మాత్రం శ్రీలీల నటిస్తున్న సినిమాలు ఎందుకో పెద్దగా మంచి విజయాన్ని సాధించడం లేదు. అయితే కొన్ని రోజులపాటు షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాలని ఈ హీరోయిన్ అనుకుంటుందట. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబోలో తెరకెక్కుతున్న  ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది.

 ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలాకాలంగా ఆగిపోయింది. అయితే కాస్త బ్రేక్ దొరకడంతో ప్రస్తుతం తన ఎంబిబిఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ పై శ్రీ లీల ఫోకస్ చేయాలని అనుకుంటుందట. అయితే గత కొన్ని రోజుల నుంచి సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకొని చదువుపై శ్రీ లీలా దృష్టి పెట్టబోతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ చేతిలో ఉన్న కమిట్మెంట్స్ అన్ని అయిపోవడంతో ఇన్నాళ్లకు ఇక దీనిపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు శ్రీలీలా అవకాశం వచ్చిందట. అయితే ఇలా ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు చదువును కూడా కొనసాగిస్తూ ఉండడంతో అభిమానులు అందరూ కూడా శ్రీ లీల  పట్టుదలకు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: