'హనుమాన్' కోసం ఆ పని చేసి.. చూపు కోల్పోయిన తేజ సజ్జ?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలను చూసినప్పుడల్లా ప్రేక్షకులకు ఒక రకమైన ఆలోచన వస్తూ ఉంటుంది. వీళ్ళకేంటి ఎప్పుడూ కలర్ఫుల్ దుస్తులు ధరిస్తూ.. నచ్చిన కార్లలో తిరుగుతూ  ఇక నచ్చినట్లుగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక సినిమాల ద్వారా వచ్చే కోట్ల రూపాయలతో లగ్జరీ లైఫ్ లో తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ సినీ సెలబ్రిటీలు ఇక తెరమీద కనిపించినంత ఆనందంగా ఉండరు. సినిమా కోసం ఎలాంటి రిస్క్ చేయడానికి అయినా సిద్ధపడుతూ ఉంటారు అని కొన్ని కొన్ని విషయాలు తెరమీదకి వచ్చినప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. ప్రాణాలను పణంగా పెట్టి మరి ఇక ఎంతోమంది నటీనటులు సినిమాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో ఇక ఇప్పుడు తేజ సజ్జ కూడా చేరిపోయాడు. ఒకప్పుడు బాల నటుడుగా అలరించిన తేజ సజ్జ ఇప్పుడు హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ప్రేక్షకులు ముందుకు వస్తూ వరుసగా హిట్లు కొడుతున్నాడు. హనుమాన్ అనే ఒక సూపర్ హీరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. సంక్రాంతి బరిలో బడా హీరోలు ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా తేజసజ్జ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పాలి. అయితే హనుమాన్ మూవీలో ఇక ప్రేక్షకులను మెప్పించేందుకు చేసిన ఒక పని కారణంగా చివరికి తేజ  చూపు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందట.

 ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో తేజ కళ్ళు రెడ్ గా కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా కళ్ళు రెడ్ గా కనిపించేందుకు లెన్స్ తో పాటు గ్లిజరిన్ కూడా ఎక్కువగా వాడాడట తేజ. దీంతో అతని కుడి కన్ను దాదాపు 70% పాడైపోయి చూపు కూడా మందగించిందట. ఏకంగా ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా కార్డియో దెబ్బతింది అని వైద్యులు తెలిపారట. ఇక ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటానని తేజ సజ్జ తెలిపాడట. ఇక ఇప్పుడు ఈ మూవీ సూపర్ హిట్ కాగా మరికొన్ని రోజుల్లో తేజ కంటికి ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: