కథ చెప్పేందుకు వెళ్తే.. నిర్మాత వాచ్ మెన్ కు చెప్పమన్నాడు : ప్రశాంత్ వర్మ

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరే మారుమోగుతూ ఉంటుంది. అద్భుతంగా తెరకెక్కించే టాలెంట్ ఉండాలి కానీ బడ్జెట్ తో సంబంధం లేకుండా మంచి సినిమాలు తీయవచ్చు అని ప్రతిసారి కూడా నిరూపిస్తూనే ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ఇక తన సినిమాలతో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు అని చెప్పాలి. రొటీన్ రొడ్డ కొట్టుడు కథలు కాకుండా ప్రేక్షకులు కనీ విని ఎరుగని రీతిలో వినూత్నమైన కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నాడు.

 ఈ క్రమంలోనే వరుసగా బ్లాక్బస్టర్లు సాధిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఇండియన్ సూపర్ హీరో మూవీగా హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి బరిలో బడా హీరోలు ఎంతమంది ఉన్నా.. తన సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఇక విడుదల చేశాడు. విడుదల చేయడమే కాదు స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ ను సాధించాడు ప్రశాంత్ వర్మ. ఇక అతని టాలెంట్ చూసి ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నిర్మాతలు సిద్ధపడిపోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే గతంలో ఓ ఇంటర్వ్యూ సమయంలో ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.

 తక్కువ బడ్జెట్ తో సినిమా చేస్తామంటే నిర్మాతలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో అన్ని రకాల అవమానాలు చూసాను అంటూ వెల్లడించాడు. కథ చెబుతాను అంటే నిద్రపోయిన నిర్మాతలు ఉన్నారు అంటూ తెలిపాడు. ఒక ప్రొడ్యూసర్ రాత్రి రెండు గంటల సమయంలో కథ వింట అని చెబితే ఆయన ఇంటికి వెళ్లాను. చివరికి అక్కడికి వెళ్ళాక ఇంటి ముందు సిట్టింగ్ పెట్టుకుని కథ చెప్పమని అడిగాడు అంటూ కామెంట్ చేశాడు. ఆరోజు దాదాపు 3 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లాను అంటూ ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. ఇక కొంతమంది నిర్మాతలు అయితే వాచ్మెన్ ఆఫీస్ బాయ్ కి కథ చెప్పాలని అనేవారు. నా లైఫ్ లో 300 నుంచి 400 నరేషన్స్ ఇచ్చాను అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక నాకు ఇచ్చిన ఎన్నో చెక్స్ బౌన్స్ కూడా అయ్యాయి అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: