హీరోయిన్లతో సుధీర్ లిప్ లాక్ సీన్లు చేయకపోవడానికి.. కారణం అదేనట?

praveen
సుడిగాలి సుదీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్నాడు సుదీర్. ఇక యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ నడిపి తెలుగుప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం బుల్లితెరతోనే తన కెరీర్ కు పుల్ స్టాప్  పెట్టకుండా వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కనిపించిన సుధీర్ ఇక ఇప్పుడు ఏకంగా హీరోగా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.

 ఈ క్రమంలోనే హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా తన కెరియర్ను నిలబెట్టుకునేందుకు చాలానే కష్టపడుతున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన సుధీర్.. మొన్నటికి కాలింగ్ సహస్ర అనే క్రైమ్ థ్రిల్లర్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ మూవీ పెద్దగా సుధీర్ కెరియర్ కు ఉపయోగపడలేదు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు సుధీర్ హీరోగా నటించిన సినిమాలు చూసుకుంటే.. హీరోయిన్లతో మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలు కానీ లిప్లాక్ సీన్లు కానీ కనిపించవు అని చెప్పాలి.
 ఇతర యంగ్ హీరోలందరూ లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోతూ ఉంటే అటు సుధీర్ మాత్రం వీటికి దూరంగానే ఉంటున్నాడు. ఇదే విషయంపై ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు సుదీర్. ఫ్యామిలీ ఆడియోన్స్ లో సుధీర్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అమ్మాయిలు మహిళతో పాటు పెద్ద వాళ్ళు కూడా సుదీర్ ని ఇష్టపడుతుంటారు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈయన సినిమాలను చూస్తూ ఉంటారు. దీంతో ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని అంతా హాయిగా చూసి తన సినిమాలు ఉండాలని సుధీర్ అనుకొంటున్నాడట. అంతకుమించి ఆడవాళ్లంటే  తనకు గౌరవం అని.. వారిని తక్కువ చేసి చూడటం కానీ వారిని అసభ్యంగా చూడటానికి తాను ఒప్పుకోనని.. గౌరవంగా చూడాలని.. అందుకే తన సినిమాల్లో ఆ రెస్పెక్ట్ ఉండాలని కోరుకుంటానని.. అందుకే లిప్ లాక్ రొమాన్స్ వంటి వాటికి తాను దూరంగా ఉంటాను అంటూ సుదీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: