అయ్యబాబోయ్.. అమర్ దీప్ భార్య యూట్యూబ్ తో ఇంత సంపాదిస్తుందా?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది బుల్లితెర సెలబ్రిటీలు ఇక సీరియల్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. ఒకేసారి రెండు మూడు సీరియల్స్ లో నటించడం ద్వారా బాగానే వెనకేసుకుంటున్నారు అని చెప్పాలి. అయితే సీరియల్స్ లో తమకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఇక యూట్యూబ్లో కూడా ఎన్నో వీడియోలు చేస్తూ ఇక రెండు చేతులారా సంపాదిస్తున్న వారు చాలామంది కనిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీరియల్స్ లో వచ్చిన దానికంటే యూట్యూబ్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్న బుల్లితెర సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో నటి తేజస్విని గౌడ్ కూడా ఒకరు.

 ఈమె కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు తమిళ బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే సహనటుడు అమర్దీప్ ను ప్రేమ వివాహం చేసుకుంది తేజస్విని గౌడ. అయితే ప్రస్తుతం తెలుగులో పెద్దగా సీరియల్స్ లో కనిపించక పోయిన.. అటు తమిళంలో మాత్రం వరుసగా అవకాశాలను అందుకుంటు బిజీ గానే ఉంది. అయితే తేజస్విని ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా నడిపిస్తోంది. ఇప్పటివరకు ఎన్నో వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 అయితే ఇటీవల కాలం లో సీరియల్స్ తో బిజీగా ఉండడంతో ఎక్కువగా వీడియోలు చేయలేక పోతోంది తేజస్విని. అయితే ఒకప్పుడు మాత్రం ఇక యూట్యూబ్ ద్వారా భారీగానే సంపాదించిందట ఈ నటి. ఏకంగా ఈమెకు 16 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఏకంగా నెలకు 30 లక్షల వరకు తేజస్విని గౌడ ఆదాయం సంపాదించిందట. ఇటీవల కాలంలో ఎంతోమంది బుల్లితెర  సెలబ్రిటీలు కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఈ రేంజ్ లోనే సంపాదిస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఇక ఈమె సంపాదన గురించి తెలిసి అటు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: