'దేవర' లో చేస్తున్నప్పుడు.. నా సినిమాలన్నీ వర్క్ షాప్ లా అనిపించాయి?

praveen
అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ఇప్పట్లో ఎంతో మంది హీరోలు ఒకటి రెండు సినిమాలు వివిధ భాషల్లో హిట్ అయితేనే పాన్ ఇండియా హీరో అంటూ చెప్పుకుంటున్నారు. కానీ అప్పట్లో పాన్ ఇండియా అనే పదం వినిపించనప్పుడే శ్రీదేవి ఏకంగా తెలుగు, కన్నడ, తమిళ మలయాళంతో పాటు అటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించి పాన్ ఇండియా రేంజ్ లో చక్రం తిప్పింది.

 ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన ప్రస్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం ప్రేక్షకుల మదిలో పదిలంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న జాన్వి కపూర్ తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాతో.. ఇక ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే జాన్వి కపూర్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ఈ బాలీవుడ్ భామ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది.

 అయితే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తరపున దేవర సినిమా గురించి ఇటీవల జాన్వి కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. జాన్వీ కపూర్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ.. దేవర సెట్స్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఇప్పటివరకు నా కెరియర్ లో చేసిన సినిమాలు అన్నీ కూడా వర్క్ షాప్ మాత్రమే అన్నట్లుగా అనిపించాయి. ఇప్పుడే నేను హీరోయిన్ గా మొదటి సినిమా చేస్తున్నానేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఇక దేవర మూవీ తోనే నా అసలైన కెరియర్ మొదలైంది అంటూ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. కాగా జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: