సో క్యూట్.. రణబీర్ కూతురు ఎంత ముద్దుగా ఉందో చూడండి?

praveen
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ గా కొనసాగుతున్న రణబీర్ కపూర్, ఆలియా భట్ జంట గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇద్దరు కూడా బాలీవుడ్ లో స్టార్స్ గానే కొనసాగుతూ ఉన్నారు. ఎవరికి వారు కెరియర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు అని చెప్పాలి. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట రెండేళ్ల క్రితం పెళ్లి అనే బంధంతో తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన రెండు నెలలకే ఆలియా భట్ ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసేసింది. దీంతో ఇక ఆమెపై గతంలో ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి.

 ఈ స్టార్ కపుల్స్ కు 2022 నవంబర్ ఆరవ తేదీన కూతురి రాహ జన్మించింది. అయితే ఇక ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు తమకు పుట్టిన బిడ్డల ముఖాన్ని కెమెరా కంట చిక్కకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇప్పటినుంచి వారికి మీడియాలో వైరల్ చేయడం ఇష్టం లేక ఇలాంటిది చేస్తూ ఉన్నారు అని చెప్పాలి  అయితే స్టార్ కపుల్ రణబీర్, ఆలియా భట్ కూడా ఇదే చేశారు. దాదాపు ఏడాది పాటు అటు కూతురు ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించలేదు. ఇందుకు కారణం కూడా ఓ సందర్భంలో చెప్పింది ఆలియా భట్. తాము కొత్తగా తల్లిదండ్రులమయ్యామని ఇంటర్నెట్లో మా కూతురు ఫోటోలు తిరుగుతుంటే తమకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అర్థం కాక ముఖం చూపించడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

 అయితే గత ఏడాది క్రిస్మస్ కు ఇక కపూర్ వారసురాలని మీడియాకు పరిచయం చేశారు ఈ స్టార్ కపుల్. ఈ క్రమంలోనే రాహ అచ్చుగుద్దినట్లుగా ఆమె తాత రిషి కపూర్ పోలికలతోనే ఉంది అని చెప్పాలి. ఇక రాహ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయ్. ఇక ఇప్పుడు మరోసారి ఈ బేబీ ఫోటోలు వైరల్ అయ్యాయి. రణబీర్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్ లో కనిపించి సందడి చేసింది. ఇక కూతురు రాహాను ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో మీడియాకు హాయ్ చెప్పాడు రణబీర్. వెనకనుంచి ఆలియా క్యాజువల్ డ్రెస్ లో కారు ఎక్కుతూ కనిపించింది.  అయితే అక్కడున్న వారందరి కళ్ళు కూడా రాహా మీదనే ఉన్నాయి. పింక్ కలర్ స్వెటర్లో రాహా ఎంతో క్యూట్ గా ఉంది. ఇక ఈ ఫోటో చూసి అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: