నేను హీరోయిన్ల మొహం అసలు చూడను.. రాఘవేంద్రరావు కామెంట్స్ వైరల్?

praveen
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో ఎంత మంది సీనియర్ డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు ఉన్న అటు రాఘవేంద్రరావుకి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. ఇక ఆయన తన సినిమాల తో ఏకంగా ప్రేక్షకులందరికీ హృదయాలు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అందుకే తెలుగు ప్రేక్షకులు ఆయనని దర్శకేంద్రుడు అని పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే హీరోయిన్లను అందంగా చూపించడంలో ఇక రాఘవేంద్ర రావును మించిన దర్శకుడు మరొకరు లేరు అని టాలీవుడ్ ప్రేక్షకులందరి భావన.

 ఇక ఇప్పటి వరకు ఎంతో మంది సాదాసీదా హీరోలను తన సినిమాలతో స్టార్ హీరోలుగా మార్చిన ఘనుడు రాఘవేంద్ర రావు. ఇక ఎంతో మంది స్టార్ హీరోలు సైతం తమ వారసులు ఇక రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయితే బాగుంటుందని అప్పట్లో నమ్మేవారు. అయితే హీరోయిన్లను ఏకంగా పండ్లు పూలతో అభివర్ణిస్తూ అందం  గా చూపిస్తూ ఉంటాడు రాఘవేంద్ర రావు. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు సినిమాలో ఏకంగా హీరోయిన్లపై పండ్లు పడేయడం కామన్ గా చూడవచ్చు  అయితే హీరోయిన్లను అంత అందంగా ఎలా చూపిస్తారు అంటూ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావును అడిగాడు.

 ఈ క్రమంలోనే.. హీరోయిన్ల మొహం నేను చూడను అంటూ రాఘవేంద్రరావు సమాధానం చెప్పాడు. వాళ్ళ మైనస్లు ఏంటో నేను చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి బాగుంటాయని.. ఇక పూర్తిగా అందంగా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు అంటూ రాఘవేంద్ర రావు తెలిపాడు. ఇక వాళ్లలో ఏవి బాగుంటాయో అవి ఎక్కువగా చూపించాలనేదే నా ఫార్ములా అంటూ కామెంట్ చేశాడు రాఘవేంద్ర  రావు. ఇక ఏ హీరోయిన్ కూడా పూర్తిగా అందం గా ఉండదని.. ఏదో ఒక మైనస్ కచ్చితం గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దర్శకుడు చేయాల్సిన పని కూడా అదే అంటూ రాఘవేంద్ర రావు తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: